వెటల్ కు 'పోల్ పొజిషన్' | singapore grand prix, vettel on pole | Sakshi
Sakshi News home page

వెటల్ కు 'పోల్ పొజిషన్'

Published Sat, Sep 19 2015 8:33 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

వెటల్ కు 'పోల్ పొజిషన్' - Sakshi

వెటల్ కు 'పోల్ పొజిషన్'

సింగపూర్:సింగపూర్ గ్రాండ్ ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ అదరగొట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిలో వెటెల్ అందరి కంటే వేగంగా ల్యాప్ ను పూర్తి చేసిన పోల్ పొజిషన్ సాధించాడు. మరోవైపు  వెటెల్ కంటే ఒక నిముషం 40 సెకన్లు వెనుకబడ్డ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.

 

ఈ సీజన్ లో మెర్సిడెస్ జట్టు ఆకట్టుకున్నా.. సింగపూర్ గ్రాండ్ ప్రిలో మాత్రం కాస్త వెనుకబడింది. ఇదిలా ఉండగా రెడ్ బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం సాధించగా,  ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ మూడో స్థానం, ఎస్టీఆర్ డ్రైవర్ క్వియాట్ లు నాలుగో స్థానం సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్ బర్గ్ 11వ స్థానం,పెరెజ్  లు 13 స్థానంతో ల్యాప్ ను పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement