మెక్సికో సిటీ: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ సీజన్‌లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు.
మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 16.171 సెకన్లలో) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 16.260 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు.
బ్రిటన్ స్టార్ డ్రైవర్ హామిల్టన్ (మెర్సిడెస్) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘మెక్సికోలాంటి క్లిష్ట తరమైన ట్రాక్‌పై వరుసగా రెండు ల్యాప్‌ల్లో అగ్రస్థానంతో ముగించడం ఆనందంగా ఉంది’ అని సెయింజ్ అన్నాడు. మెయిన్ రేసును సెయింజ్ పోల్
పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment