CARLOS
-
సెయింజ్‌కు ‘పోల్’ పొజిషన్
మెక్సికో సిటీ: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ (1 నిమిషం 16.171 సెకన్లలో) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 16.260 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్ హామిల్టన్ (మెర్సిడెస్) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘మెక్సికోలాంటి క్లిష్ట తరమైన ట్రాక్‌పై వరుసగా రెండు ల్యాప్‌ల్లో అగ్రస్థానంతో ముగించడం ఆనందంగా ఉంది’ అని సెయింజ్ అన్నాడు. మెయిన్ రేసును సెయింజ్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. -
ఒలింపిక్ స్వర్ణాల విజేతకు భారీ నజరానా
మనీలా: విశ్వక్రీడల పతకాలకు ఉన్న ప్రతిష్టకు ఇదొక మచ్చుతునక. ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యులో పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ‘రిసార్ట్ హోమ్’ను బహుకరించాలని నిర్ణయించింది. సాధారణంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, క్రీడా అవార్డులు, స్థానిక ప్రభుత్వాలైతే విలువైన ఇంటి స్థలాల్ని ఇవ్వడం పరిపాటి! కానీ ఫిలిప్పీన్స్ మాత్రం కార్లోస్‌కు అద్వితీయ కానుకను సిద్ధం చేస్తోంది. అంతేనా... తమ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. పారిస్ నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న 24 ఏళ్ల చాంపియన్‌కు అసాధారణ ఏర్పాట్లతో వెల్కమ్ చెప్పిన ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 10 లక్షల అమెరికా డాలర్లు (రూ. 8.39 కోట్లు) చెక్ ఇవ్వడంతోపాటు ఒక రిసార్ట్ హోమ్‌నే బహుమతి ఇస్తామని ఆ రిసార్టులో జీవితకాలం ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. కార్లోస్ రెండు స్వర్ణాలతో పారిస్ గేమ్స్ పతకాల పట్టికలో ఫిలిప్పీన్స్ 37వ స్థానంలో నిలిచింది. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత కార్లోస్ సెయింజ్
సింగపూర్: ఫార్ములావన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్ అయ్యాడు. నిర్ణీత 62 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అందరికంటే వేగంగా గంటా 46 నిమిషాల 37.418 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 22 రేసుల ఈ సీజన్లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు. అయితే సింగపూర్ గ్రాండ్‌ప్రిలో వీరిద్దరికి నిరాశ ఎదురైంది. వెర్స్టాపెన్ ఐదో స్థానంతో, పెరెజ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
సెయింజ్‌కు ‘పోల్’
సింగపూర్: ఫార్ములావన్‌లో ఈ సీజన్లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, సెర్జియో పెరెజ్ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ 11వ స్థానంలో, పెరెజ్ 13వ స్థానంలో నిలిచారు. నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ 11వ స్థానం నుంచి, పెరెజ్ 13వ స్థానం నుంచి ప్రారంభిస్తారు. మరోవైపు ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 30.984 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి మొదలు పెడతాడు. ఈ సీజన్లో 14 రేసులు జరగ్గా... 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12 రేసుల్లో), పెరెజ్ (2 రేసుల్లో) విజేతలుగా నిలిచారు. -
సెయింజ్‌కు ‘పోల్’
మోంజా: ఫార్ములావన్ సీజన్లో భాగంగా ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 20.294 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో సెయింజ్కిది తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. రికార్డుస్థాయిలో వరుసగా పదో విజయంపై దృష్టి సారించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఒకవేళ నేటి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిస్తే ఫార్ములావన్ చరిత్రలో ఒకే సీజన్లో వరుసగా 10 విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ఫెరారీకి చెందిన లెక్లెర్క్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 రేసులు జరగ్గా అన్నింటా రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతలుగా నిలిచారు. వెర్స్టాపెన్ 11 రేసుల్లో, పెరెజ్ రెండు రేసుల్లో నెగ్గారు. -
US Open 2022: అల్కరాజ్ అద్భుతం
న్యూయార్క్: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, 21 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ సమరమిది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్కరాజ్దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా 1990 (పీట్ సంప్రాస్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్కరాజ్ 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు. 2006 (ఆండీ రాడిక్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం. ప్రతీ షాట్లో పోరాటం... ఈ ఏడాది వింబుల్డన్‌లో సిన్నర్ చేతిలో ఓడిన అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో కోలుకున్న సిన్నర్ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్ పాయింట్‌ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్కరాజ్ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. సిన్నర్ పదునైన డిఫెన్స్‌తో స్పెయిన్ ఆటగాడిని అడ్డుకోగలిగాడు. నాలుగో సెట్ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్‌ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్ చేరేందుకు సర్వీస్ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్కరాజ్ పదో గేమ్‌తో పాటు మరో రెండు గేమ్‌లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్‌కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్కరాజ్ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్‌ను సాధించి మ్యాచ్ గెలుచుకున్నాడు. సిన్నర్ 8, అల్కరాజ్ 5 ఏస్‌ల చొప్పున కొట్టగా... అల్కరాజ్ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు. నంబర్‌వన్ జోరు... మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరైనా సబలెంకా (బెలారస్) సెమీస్‌లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. -
మెక్సికో తీరంపై హరికేన్ దాడి