ఫిలిప్పీన్స్ ఒలింపిక్ విజేతకు ఏకంగా ‘రిసార్ట్ హోమ్’ బహుమతి
మనీలా: విశ్వక్రీడల పతకాలకు ఉన్న ప్రతిష్టకు ఇదొక మచ్చుతునక. ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యులో పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, వాల్ట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ‘రిసార్ట్ హోమ్’ను బహుకరించాలని నిర్ణయించింది. సాధారణంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, క్రీడా అవార్డులు, స్థానిక ప్రభుత్వాలైతే విలువైన ఇంటి స్థలాల్ని ఇవ్వడం పరిపాటి!
కానీ ఫిలిప్పీన్స్ మాత్రం కార్లోస్‌కు అద్వితీయ కానుకను సిద్ధం చేస్తోంది. అంతేనా... తమ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. పారిస్ నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న 24 ఏళ్ల చాంపియన్‌కు అసాధారణ ఏర్పాట్లతో వెల్‌కమ్ చెప్పిన ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 10 లక్షల అమెరికా డాలర్లు (రూ. 8.39 కోట్లు) చెక్ ఇవ్వడంతోపాటు ఒక రిసార్ట్ హోమ్‌నే బహుమతి ఇస్తామని ఆ రిసార్టులో జీవితకాలం ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. కార్లోస్ రెండు స్వర్ణాలతో పారిస్ గేమ్స్ పతకాల పట్టికలో ఫిలిప్పీన్స్ 37వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment