పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్‌కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది.
2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్‌లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది.
(చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!)
Comments
Please login to add a commentAdd a comment