మోంజా: ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 20.294 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్‌లో సెయింజ్‌కిది తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం.
రికార్డుస్థాయిలో వరుసగా పదో విజయంపై దృష్టి సారించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్‌స్టాపెన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఒకవేళ నేటి రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిస్తే ఫార్ములావన్ చరిత్రలో ఒకే సీజన్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.
ఫెరారీకి చెందిన లెక్‌లెర్క్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 రేసులు జరగ్గా అన్నింటా రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతలుగా నిలిచారు. వెర్‌స్టాపెన్ 11 రేసుల్లో, పెరెజ్ రెండు రేసుల్లో నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment