Italian Grand Prix
-
సెయింజ్‌కు ‘పోల్’
మోంజా: ఫార్ములావన్ సీజన్లో భాగంగా ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 20.294 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో సెయింజ్కిది తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. రికార్డుస్థాయిలో వరుసగా పదో విజయంపై దృష్టి సారించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఒకవేళ నేటి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిస్తే ఫార్ములావన్ చరిత్రలో ఒకే సీజన్లో వరుసగా 10 విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ఫెరారీకి చెందిన లెక్లెర్క్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 రేసులు జరగ్గా అన్నింటా రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతలుగా నిలిచారు. వెర్స్టాపెన్ 11 రేసుల్లో, పెరెజ్ రెండు రేసుల్లో నెగ్గారు. -
వెర్స్టాపెన్ ఖాతాలో 11వ విజయం
ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టినా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 11వ విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచి వరుసగా ఐదో విజయం నమోదు చేశాడు. 12వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన వెర్స్టాపెన్ అదే జోరులో నిర్ణీత 53 ల్యాప్‌ల రేసును గంటా 20 నిమిషాల 27.511 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం వెర్స్టాపెన్ 335 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లెక్లెర్క్ 219 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 2న జరుగుతుంది. చదవండి: Asia Cup 2022: ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
దేవుడా.. ఆ డివైజ్ లేకుంటే ప్రాణాలు పోయేవే!
రెడ్‌బుల్-మెర్సెడెస్ టాప్ రేసర్లు మరోసారి దూకుడు చర్యలతో వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, రెడ్‌బుల్ రేసర్ వెర్స్టాపెన్ కార్ల ‘ఢీ’యాక్షన్.. పరస్పర విమర్శలతో వేడెక్కిస్తోంది. ‘‘ఇవాళ నా అదృష్టం బాగుండి బతికా. హలోకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకుంటే ఏమైపోయేవాడినో..’’ అంటూ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ లూయిస్ హామిల్టన్ చెబుతున్నాడు. ఆదివారం వారియంట్ డెల్ రెటాయిలియో రేసుకోర్టులో జరిగిన ఇటలీ పార్కో డీ మోంజా(ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1) రేసులో మెక్లారెన్ రేసర్ డానియల్ రిక్కియార్డో(ఆసీస్-ఇటాలియన్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 53 ల్యాప్లతో జరిగిన రేసులో.. 26వ ల్యాప్ వద్ద 225 కిలోమీటర్ల వేగంతో దూసుకుకొచ్చిన రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ రేస్ కారు.. మెర్సెడెస్ రేసర్ హామిల్టన్ రేస్కారును ఎక్కేసింది. రెండు వాహనాలు ట్రాక్ తప్పి పక్కకు దూసుకెళ్లాయి. 750 కేజీల వెహికిల్ ముందుభాగం పచ్చడికాగా.. క్రాష్‌లో హామిల్టన్ ప్రాణాలు పోయి ఉంటాయని అంతా కంగారుపడ్డారు!. కానీ, హలొ డివైజ్ వల్ల పెద్దగాయాలేవీ కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు హామిల్టన్. క్రాష్ తర్వాత తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చిన హామిల్టన్.. ఆ తర్వాత మెడ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు. Another hugely dramatic moment in the Verstappen/Hamilton title battle 💥😮#ItalianGP 🇮🇹 #F1 pic.twitter.com/P4J4bN6wX2 — Formula 1 (@F1) September 12, 2021 హలో.. వివాదం హలొ అనేది సేఫ్టీ డివైజ్. క్రాష్ ప్రొటెక్షన్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఓపెన్ వీల్ రేసింగ్ సిరీస్‌లలో వీటిని వాడ్తారు. డ్రైవర్ తల భాగంలో కర్వ్ షేప్‌లో ఉంటుంది ఇది. 2016-2017 జులై మధ్యకాలంలో ఈ డివైజ్‌ను టెస్ట్‌లకు ఉపయోగించారు. ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో 2018 ఎఫ్ఐఏ సీజన్ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ రేసులో దీన్ని తప్పనిసరి చేశారు. ఇండీకార్ హలొ మాత్రం ఎయిరోస స్క్రీన్ కోసం వేరే ఫ్రేమ్‌లో ఉంటుంది. అయితే దీని వాడకంపై వివాదం నడుస్తున్నా.. ఇలా ప్రాణాలు కాపాడటం ఇది రెండోసారి!. గతంలో ఈ డివైజ్‌ను తీసుకొచ్చిన కొద్దిరోజులకే రేసర్ చార్లెస్ లెక్లెరిక్ పప్రాణాలు కాపాడింది. స్పా ఫ్రాన్కోర్చాంప్స్(2018) రేస్ సందర్భంగా ఫస్ట్ ల్యాప్‌లోనే ఫెర్నాండో అలోన్సో ‘మెక్లారెన్’తో క్రాష్ అయినప్పటికీ.. ఆ ప్రమాదం నుంచి లెక్లెరిక్ చిన్నగాయం కూడా కాకుండా బయటపడగలిగాడు. ఇక వెర్స్టాపెన్-హామిల్టన్ మధ్య జరిగిన క్రాష్ వివాదానికి తెరలేపింది. వెర్‌స్టాపెన్‌కు పెనాల్టీ విధించినప్పటికీ.. మెర్సిడెస్ మేనేజ్మెంట్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా భావించాలని కోరుతోంది. చదవండి: డేంజరస్ క్రాష్.. సిగ్గులేకుండా హామిల్టన్ సంబురాలు -
ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి
రోమ్: ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో విషాదం చోటచేసుకుంది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీలో స్విట్జర్లాండ్‌కు చెందిన మోటో 3 డ్రైవర్ జాసన్ డుపాస్క్వియర్ ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా తీవ్ర గాయాలతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడంతో జాసన్ ఆదివారం మృతి చెందినట్లు ఇటాలియన్ గ్రాండ్ప్రిక్స్ మోటోజీపి నిర్వాహకులు ప్రకటించారు. జాసన్ డుపాస్క్వియర్ మృతి పట్ల మోటోజీపీ ట్విటర్లో సంతాపాన్ని ప్రకటించింది. 'మోటోజీపీ తరపున జాసన్ డుపాస్క్వియర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం. ఇంత చిన్న వయసులో అతను మనల్ని వదలివెళ్లడం బాధాకరం. ఈ సందర్భంగా అతని ఫ్యామిలీ, మిత్రులకు మా ప్రగాడ సానభూతిని తెలుపుతున్నాం అని ట్వీట్ చేసింది. కాగా మోటో 3 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డుపాస్క్వియర్ ప్రస్తుతం రెండవ సీజన్లో ఉన్నాడు. కాఆగా అతను 27 పాయింట్లతో మోటో3లో 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. డుపాస్క్వియర్ తన కెరీర్‌ను సూపర్మోటోలో ప్రారంభించాడు, అక్కడ అతను చాలాసార్లు స్విస్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు 2016 లో ఎన్ఇసి ఛాంపియన్షిప్ మోటో 3 టైటిల్‌ను గెలుచుకున్నాడు. చదవండి: డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు -
ఎఫ్-3 రేసు: గాల్లోకి లేచి ఎగిరపడ్డ కారు
మోంజా(ఇటలీ): ఇటలీ గ్రాండ్ ప్రి రేసులో 19 ఏళ్ల డ్రైవర్ అలెక్స్ పెరోని తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫార్ములావన్-3లో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో అలెక్స్ పెరోని కారు ఉన్నట్టుండి గాల్లోకి లేవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ల్యాప్‌లను పూర్తి చేస్తున్న సమయంలో చిన్నపాటి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన కారు అమాంతం పైకి లేచింది. గాల్లోనే చక్కర్లు కొడుతూ సుమారు 50 మీటర్ల దూరంలో పడింది. కాగా, డ్రైవర్ పెరోని సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత మామాలుగా లేచి మెడికల్ కారు దగ్గరకు వచ్చాడు. అతని ఆస్పత్రికి తరలించగా పలు పరీక్షలు చేసి ఎటువంటి ఫ్యాక్చర్స్ కాలేదని వైద్యులు తేల్చారు. దాంతో ఎఫ్-3 యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఈ రోజు జరిగే ఎఫ్-2 రేసులో సైతం పెరోని పాల్గొనాల్సి ఉండగా, ప్రమాదం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు. We are all extremely relieved that Alex Peroni walked away from this crash during Race 1 in Monza. He is currently under medical observation.#ItalianGP 🇮🇹 #F3 pic.twitter.com/UdlcFSIqBH — Formula 3 (@FIAFormula3) September 7, 2019 -
హామిల్టన్ పై దర్యాప్తు
విజయవంతంగా రేస్ ముగించిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్, అతని సహచరుడు రోస్ బర్డ్ పై ఫార్ములా వన్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. రేస్ కు ముందు నిర్నీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉండటమే దీనికి కారణమని ప్రాధమికంగా తెలుస్తోంది. రేస్ కు ముందు ఎఫ్ వన్ కారు టైర్ లో 19.5psi వత్తిడి ఉండాలి. అయితే.. మెర్సిడెజ్ కార్లు రెండింటిలోనూ నిర్ణీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై మెర్సిడెజ్ అధికారులకు ఎఫ్ఐఎ ప్రతినిధి జో బాయర్ రిపోర్టు అందించాడు. దీనిపై విచారణ కొనసాగనుంది. -
హామిల్టన్ మళ్లీ గెలిచాడు
సర్కూట్ మారినా.. వెటెల్ ఎంత ట్రై చేసినా.. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రేస్ గెలిచాడు. ఇటలీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్ లో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. మోంజాలో జరిగిన రేస్ లో ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ 53 ల్యాప్ ల రేసును గంటా 18 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సంపాదించాడు. పోల్ పొజిషన్ తో రేస్ ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ కు ఆద్యంతం ప్రత్యర్ధి ఫెరారీ డ్రైవర్ వెటెల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో పాటు రేస్ కు ముందు కార్ లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. విక్టరీని చేజిక్కించుకున్నాడు. ఇక ఫెరారీ డ్రైవర్ వెటెల్ ఎంత ప్రయత్నించినా.. హామిల్టన్ ను అధిగమించలేక పోయాడు. 25 సెకండ్లు వెనకబడ్డ వెటెల్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్ధానంలో రేస్ మొదలు పెట్టిన విలియమ్స్ డ్రైవర్ మాసా.. మూడో స్ధానంతో రేస్ ముగించాడు. విలియమ్స్ మరో డ్రైవర్ బోట్టాస్, ఫెరారీ రెండో డ్రైవర్ రైకోనెన్ నాలుగు, ఐదో స్ధానల్లో రేస్ ముగించారు. కాగా ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ప్రధాన రేస్ కు ముందు డ్రైవర్లు అంతా.. గత నెలలో అమెరికా రేస్ లో మరణించిన డ్రైవర్ జస్టిన్ విల్సన్ మృతికి సంతాపంగా.. ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రపంచ ఛాపింయన్ హామిల్టన్... జస్టిన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. రేస్ ముందు ట్విట్టర్ నివాళి తెలిపాడు. భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్ధానంలో నిలవగా.. హుల్కెన్ బర్గ్ ఏడో స్థానంతో రేస్ ముగించాడు. సీజన్ తదుపరి రేస్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ సెప్టెంబర్ 20న జరుగుతుంది. డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ ( 252పాయింట్లు), రోస్ బర్గ్ (199 పాయింట్లు), వెటెల్ (178 పాయింట్లు)తో వరసగా తొలి మూడు స్ధానాల్లో ఉన్నారు.