హామిల్టన్ మళ్లీ గెలిచాడు
సర్కూట్ మారినా.. వెటెల్ ఎంత ట్రై చేసినా.. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రేస్ గెలిచాడు. ఇటలీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్ లో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. మోంజాలో జరిగిన రేస్ లో ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ 53 ల్యాప్ ల రేసును గంటా 18 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సంపాదించాడు.
పోల్ పొజిషన్ తో రేస్ ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ కు ఆద్యంతం ప్రత్యర్ధి ఫెరారీ డ్రైవర్ వెటెల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో పాటు రేస్ కు ముందు కార్ లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. విక్టరీని చేజిక్కించుకున్నాడు. ఇక ఫెరారీ డ్రైవర్ వెటెల్ ఎంత ప్రయత్నించినా.. హామిల్టన్ ను అధిగమించలేక పోయాడు. 25 సెకండ్లు వెనకబడ్డ వెటెల్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్ధానంలో రేస్ మొదలు పెట్టిన విలియమ్స్ డ్రైవర్ మాసా.. మూడో స్ధానంతో రేస్ ముగించాడు. విలియమ్స్ మరో డ్రైవర్ బోట్టాస్, ఫెరారీ రెండో డ్రైవర్ రైకోనెన్ నాలుగు, ఐదో స్ధానల్లో రేస్ ముగించారు.
కాగా ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ప్రధాన రేస్ కు ముందు డ్రైవర్లు అంతా.. గత నెలలో అమెరికా రేస్ లో మరణించిన డ్రైవర్ జస్టిన్ విల్సన్ మృతికి సంతాపంగా.. ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రపంచ ఛాపింయన్ హామిల్టన్... జస్టిన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. రేస్ ముందు ట్విట్టర్ నివాళి తెలిపాడు.
భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్ధానంలో నిలవగా.. హుల్కెన్ బర్గ్ ఏడో స్థానంతో రేస్ ముగించాడు. సీజన్ తదుపరి రేస్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ సెప్టెంబర్ 20న జరుగుతుంది. డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ ( 252పాయింట్లు), రోస్ బర్గ్ (199 పాయింట్లు), వెటెల్ (178 పాయింట్లు)తో వరసగా తొలి మూడు స్ధానాల్లో ఉన్నారు.