F1
-
సమ్మర్లో ఎఫ్1 రేసింగ్
హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ తాజా చిత్రంగా ‘ఎఫ్1’ ఖరారైంది. ‘ఓన్లీ ది బ్రేవ్, టాప్‌గన్: మేవరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జోసెఫ్ కొసిన్క్సి ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్1’ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో ఓ రేసర్ కథగా ఈ సినిమా రూపొందనుంది. ఫార్ములా వన్ రేసింగ్‌లో ఉండే సవాళ్లు, రేసర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవన విధానాలను ఈ సినిమాలో చూపించనున్నారట జోసెఫ్. జెర్నీ బ్రూక్హైమర్, బ్రాడ్ పిట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఎఫ్1’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. -
ఫ్లిప్‌కార్ట్ చేతికి యాంత్రా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ ’రీ–కామర్స్’ కంపెనీ ’యాంత్రా’ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ వెల్లడి కాలేదు. గ్రూప్ సంస్థ ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఈ డీల్ కుదుర్చుకుంది. 2013లో జయంత్ ఝా, అంకిత్ సరాఫ్, అన్మోల్ గుప్తా కలిసి యాంత్రాను ప్రారంభించారు. ఇది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన కన్జూమర్ టెక్నాలజీ ఉత్పత్తులను రిపేరు చేసి విక్రయిస్తుంది. మరోవైపు, ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ .. ప్రధానంగా వ్యాపార వర్గాల కోసం వివిధ ఉత్పత్తులకు (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ..ఐటీ పెరిఫెరల్స్ మొదలైనవి) రిపేరు, రీఫర్బిష్మెంట్ సర్వీసులు అందిస్తోంది. యాంత్రా కొనుగోలుతో రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ మరింత చౌకగా అందుబాటులోకి తేవడానికి వీలవుతుందని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ సికారియా తెలిపారు. టెక్నాలజీని చౌకగా, అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని యాంత్రా సహ వ్యవస్థాపకుడు జయంత్ ఝా తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
ఫెరారీకి ఏమైంది...
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్‌లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్‌తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం 2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్‌లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్‌కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్‌లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పని చేయని అప్‌గ్రేడ్స్ చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్‌గ్రేడ్స్‌తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్‌గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుంది 2019 సీజన్ కారు అయినటువంటి ఎస్ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్‌లో మెర్సిడెస్, రెడ్‌బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు. -
ఉత్సాహంగా..రేస్
సాక్షి,విజయవాడ : ప్రతిష్టాత్మకమైన ఎస్1హెచ్2ఓ పవర్ బోటు రేసింగ్‌కు రెండవ రోజు ఉత్సాహంగా సాగింది. రేసింగ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. శనివారం జరిగిన కాలిఫైయింగ్ తొలిరౌండ్లో 19 జట్లు పాల్గొనగా అందులో 12 జట్లు అర్హత సాధించాయి. రెండవ క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తయిన తరువాత 6 జట్లు అర్హత సాధించాయి. ఇందులో అమరావతి బోటు కూడా అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు. నదుల్లో బోటింగ్ కొంత ఇబ్బందే సముద్రంలో జరిగే ఈ రేస్‌లు నదిలో నిర్వహించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రేసర్లను విలేకర్లు ప్రశ్నించినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉందని వారు చెప్పారు. ముఖ్యంగా నదిపై వచ్చే గాలి వల్ల, నీటి ప్రవాహం వల్ల బోట్లు నడపడం కొంచెం ఇబ్బందిగా ఉంటోదని పేర్కొన్నారు. చాకచక్యంగా, వేగవంతంగా నడుపుతున్నామని రేసర్లు చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల చేతుల్లో పాస్‌లు వీవీఐపీ పాన్లను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ పాస్‌లన్నీ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతికి, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల చేతికి వెళ్లిపోయాయి. బోట్ రేసింగ్ పై ఆసక్తితో తిలకించడానికి వచ్చే వారికి పాస్‌లు లేకపోవడంతో దుర్గాఘాట్‌లోనూ, భవానీఘాట్‌లోనూ కూర్చుని తిలకించాల్సి వచ్చింది. పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులను పెద్దఎత్తున తరలించారు. ఉదయం వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు కూర్చోలేక రేస్ ప్రారంభం కాకముందే వెళ్లిపోవడం దర్శనమిచ్చింది. సౌకర్యాలు నిల్ పున్నమి ఘాట్‌కు వచ్చిన సందర్శకులకు కావాల్సిన ఏర్పాటు చేయడంలో నిర్వహకులు పూర్తిగా విఫలమయ్యారు. మంగళగిరి చెందిన కొంతమంది యువతులు గ్యాలరీ 5కు చెందిన పాస్‌లు తీసుకువస్తే ఆ గ్యాలరీ ఎక్కడో చెప్పేవారే కరువయ్యారు. చివరకు రెండవ నెంబర్ గ్యాలరీ ఖాళీగా వుందని తెలుసుకుని అక్కడకు వెళ్లి కూర్చుని రేస్‌లను తిలకించారు. ఏ గ్యాలరీ ఎక్కడ ఉందో అధికారులే చెప్పలేకపోతున్నారని ప్రజ్ఞ సాక్షికి వివరించింది. రేస్‌ల గురించి సమాచారం చెప్పేవారే కరువయ్యారు. ఆఖరి రోజుపైనే అందరి దృష్టి రెండవ రోజు తగినంత మంది సందర్శకులు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం అదే పరిస్థితి ఉంటే ప్రతిష్ట దెబ్బతింటుందని భారీగా ప్రేక్షకుల్ని తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పవిత్ర సంగమం వద్దకు రేస్‌లు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చెప్పింది. వాస్తవంగా భవానీఘాట్ వరకు మాత్రమే బోట్లు నడుస్తున్నాయి. పవిత్ర సంగమం వద్దకు వచ్చిన వారు రేస్‌లు సరిగా కనపడటం లేదని చెప్పారు. -
వెటెల్ ‘హ్యాట్రిక్’ పోల్ పొజిషన్
బాకు (అజర్బైజాన్): ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ వరుసగా మూడో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 41.498 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
రూ.30 వేల కోట్లకు ఎఫ్1 అమ్మకం
లండన్: మోటార్ కార్ రేసింగ్‌లో అత్యంత ఆదరణ పొందిన ఫార్ములావన్ చేతులు మారింది. అమెరికాకు చెందిన లిబర్టీ మీడియా కార్పొరేషన్ ఏకంగా 4.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు)కు కొనుగోలు చేసింది. దీంతో ఇన్నాళ్లుగా ఈ డీల్‌పై కొనసాగుతున్న అనిశ్చితికి 75 ఏళ్ల బిజినెస్ టైకూన్ జాన్ మలోన్ తెర దించారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇప్పటిదాకా ఫార్ములావన్ గ్రూప్‌ను తన అదుపులో ఉంచుకుని సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నీ ఎకెల్‌స్టోన్ అదే పదవిలో కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ చేజ్ క్యారీ ఆధ్వర్యంలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. -
ఈ ఫోన్ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు!
ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ 'అప్పో' సరికొత్త ఎఫ్ సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఫొటోగ్రఫీ సెంట్రల్ ఫీచర్‌గా వెలువడుతున్న ఈ ఫోన్లు గురువారం మార్కెట్లో విడుదలకానున్నాయి. ఎఫ్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెడుతున్న తొలిఫోన్ 'అప్పో ఎఫ్1'.. భారత్‌లో 'అప్పో ఎఫ్1' ధరను ఇంకా కంపెనీ ఖరారు చేయనప్పటికీ.. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ధర 250 డాలర్లు/229 యూరోలు (సుమారు రూ. 17వేలు)గా ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 20వేలుగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పో ఎఫ్1లో ప్రధాన విశేషం.. ఈ ఫోన్లోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. వైడ్ ఎఫ్/2.0 లెన్స్, 1/4 అంగుళాల సెన్సర్ తో రానున్న ఈ ఫ్రంట్ కెమెరాతో సాండర్డ్ 5 మెగాపిక్సెల్ కెమెరా కన్నా మెరుగైన ఫొటోలు తీయవచ్చునని కంపెనీ చెప్తోంది. తక్కువ లైంటింగ్ ఉన్న పరిసరాల్లోనూ మంచి సెల్ఫీలు దిగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అప్పో ఎఫ్1లో స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్ ఉంది. దీనివల్ల మొత్తం మొబైల్ డిస్ప్లే కెమెరా ఫ్లాష్‌లాగా వ్యవహరించి.. చీకటిలోనూ మెరుగైన సెల్ఫీ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికొస్తే దీని బాడీ మిశ్రమ లోహంతో రూపొందించారు. ఐదు అంగుళాల డిస్ప్లే, దానిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఈ మొబైల్ ఫోన్ రూపొందింది. బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో ఉంటుంది. 3 జీబీ ర్యామ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ అక్టా కోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉన్న ఈ ఫోన్లో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరెజ్ ఉంటుంది. 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ను సపోర్ట్ చేస్తుంది. -
హామిల్టన్ పై దర్యాప్తు
విజయవంతంగా రేస్ ముగించిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్, అతని సహచరుడు రోస్ బర్డ్ పై ఫార్ములా వన్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. రేస్ కు ముందు నిర్నీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉండటమే దీనికి కారణమని ప్రాధమికంగా తెలుస్తోంది. రేస్ కు ముందు ఎఫ్ వన్ కారు టైర్ లో 19.5psi వత్తిడి ఉండాలి. అయితే.. మెర్సిడెజ్ కార్లు రెండింటిలోనూ నిర్ణీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై మెర్సిడెజ్ అధికారులకు ఎఫ్ఐఎ ప్రతినిధి జో బాయర్ రిపోర్టు అందించాడు. దీనిపై విచారణ కొనసాగనుంది. -
హామిల్టన్ మళ్లీ గెలిచాడు
సర్కూట్ మారినా.. వెటెల్ ఎంత ట్రై చేసినా.. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రేస్ గెలిచాడు. ఇటలీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్ లో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. మోంజాలో జరిగిన రేస్ లో ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ 53 ల్యాప్ ల రేసును గంటా 18 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సంపాదించాడు. పోల్ పొజిషన్ తో రేస్ ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ కు ఆద్యంతం ప్రత్యర్ధి ఫెరారీ డ్రైవర్ వెటెల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో పాటు రేస్ కు ముందు కార్ లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. విక్టరీని చేజిక్కించుకున్నాడు. ఇక ఫెరారీ డ్రైవర్ వెటెల్ ఎంత ప్రయత్నించినా.. హామిల్టన్ ను అధిగమించలేక పోయాడు. 25 సెకండ్లు వెనకబడ్డ వెటెల్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్ధానంలో రేస్ మొదలు పెట్టిన విలియమ్స్ డ్రైవర్ మాసా.. మూడో స్ధానంతో రేస్ ముగించాడు. విలియమ్స్ మరో డ్రైవర్ బోట్టాస్, ఫెరారీ రెండో డ్రైవర్ రైకోనెన్ నాలుగు, ఐదో స్ధానల్లో రేస్ ముగించారు. కాగా ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ప్రధాన రేస్ కు ముందు డ్రైవర్లు అంతా.. గత నెలలో అమెరికా రేస్ లో మరణించిన డ్రైవర్ జస్టిన్ విల్సన్ మృతికి సంతాపంగా.. ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రపంచ ఛాపింయన్ హామిల్టన్... జస్టిన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. రేస్ ముందు ట్విట్టర్ నివాళి తెలిపాడు. భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్ధానంలో నిలవగా.. హుల్కెన్ బర్గ్ ఏడో స్థానంతో రేస్ ముగించాడు. సీజన్ తదుపరి రేస్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ సెప్టెంబర్ 20న జరుగుతుంది. డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ ( 252పాయింట్లు), రోస్ బర్గ్ (199 పాయింట్లు), వెటెల్ (178 పాయింట్లు)తో వరసగా తొలి మూడు స్ధానాల్లో ఉన్నారు. -
రెండేళ్ల డీల్ పెంచుకున్న మాల్యా డ్రైవర్
విజయ్ మాల్యాకు చెందిన ఫార్ములా వన్ టీమ్ ఫోర్స్ ఇండియ జర్మన్ డ్రైవర్ నికో హల్కెన్ బర్గ్ ఒప్పందాన్ని పొడిగించింది. తమ జట్టు తరఫున హల్కెన్ బర్గ్ మరో రెండేళ్లు రేసుల్లో పాల్గొంటాడని టీమ్ ఓనర్ విజయ్ మాల్యా తెలిపాడు. 28ఏళ్ల హల్కెన్ బర్గ్ తన డీల్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఫోర్స్ ఇండియా స్వంత ఇంటి తో సమానమని అన్నాడు. గత రెండేళ్లలో టీమ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మరో వైపు టీమ్ ప్రిన్సిపల్ విజయ్ మాల్యా నికొ పై ప్రశంసలు కురిపించాడు. నికో లో వేగం ఉందని.. అతడికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డాడు. మరో రెండేళ్లలో ఫార్ములా వన్ క్రీడల్లో ఫోర్స్ ఇండియా మరింత ప్రగతి సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత సీజన్ లో హల్కెన్ బర్గ్ 24 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. -
ఎఫ్1 వచ్చే సీజన్ ఏప్రిల్‌లో మొదలు
మెల్బోర్న్: వచ్చే ఏడాది నుంచి ఫార్ములావన్ సీజన్లో మార్పులు జరగనున్నాయి. కొన్నేళ్లుగా ఫార్ములావన్ సీజన్ మార్చిలో మొదలై నవంబరులో ముగిసేంది. వచ్చే ఏడాది నుంచి ఈ షెడ్యూల్లో మార్పు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో 2016 ఫార్ములావన్ సీజన్‌కు తెరలేవనుంది. అయితే ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసుతోనే సీజన్ మొదలవుతుందని ఎఫ్1 చీఫ్ ఎకిల్‌స్టోన్ తెలిపారు. 2016 సీజన్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాకపోయినా... షెడ్యూల్ నుంచి ఇటలీ గ్రాండ్‌ప్రి రేసును తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.