లండన్: మోటార్ కార్ రేసింగ్‌లో అత్యంత ఆదరణ పొందిన ఫార్ములావన్ చేతులు మారింది. అమెరికాకు చెందిన లిబర్టీ మీడియా కార్పొరేషన్ ఏకంగా 4.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు)కు కొనుగోలు చేసింది. దీంతో ఇన్నాళ్లుగా ఈ డీల్‌పై కొనసాగుతున్న అనిశ్చితికి 75 ఏళ్ల బిజినెస్ టైకూన్ జాన్ మలోన్ తెర దించారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇప్పటిదాకా ఫార్ములావన్ గ్రూప్‌ను తన అదుపులో ఉంచుకుని సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నీ ఎకెల్‌స్టోన్ అదే పదవిలో కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ చేజ్ క్యారీ ఆధ్వర్యంలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది.
రూ.30 వేల కోట్లకు ఎఫ్1 అమ్మకం
Published Fri, Sep 9 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement