విజయ్ మాల్యాకు చెందిన ఫార్ములా వన్ టీమ్ ఫోర్స్ ఇండియ జర్మన్ డ్రైవర్ నికో హల్కెన్ బర్గ్ ఒప్పందాన్ని పొడిగించింది. తమ జట్టు తరఫున హల్కెన్ బర్గ్ మరో రెండేళ్లు రేసుల్లో పాల్గొంటాడని టీమ్ ఓనర్ విజయ్ మాల్యా తెలిపాడు. 28ఏళ్ల హల్కెన్ బర్గ్ తన డీల్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఫోర్స్ ఇండియా స్వంత ఇంటి తో సమానమని అన్నాడు. గత రెండేళ్లలో టీమ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
మరో వైపు టీమ్ ప్రిన్సిపల్ విజయ్ మాల్యా నికొ పై ప్రశంసలు కురిపించాడు. నికో లో వేగం ఉందని.. అతడికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డాడు. మరో రెండేళ్లలో ఫార్ములా వన్ క్రీడల్లో ఫోర్స్ ఇండియా మరింత ప్రగతి సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత సీజన్ లో హల్కెన్ బర్గ్ 24 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.
రెండేళ్ల డీల్ పెంచుకున్న మాల్యా డ్రైవర్
Published Tue, Sep 1 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement
Advertisement