
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఎఫ్1 జట్టు త్వరలోనే వేరొకరి హస్తగతం కానుంది. ఫోర్స్ ఇండియాను బ్రిటన్‌కు చెందిన ఓ శీతల పానీయాల తయారీ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రూ.1,806 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ‘రిచ్ ఎనర్జీ’ అనే బ్రిటిష్ శీతల పానీయాల సంస్థ దాదాపు 200 మిలియన్ల డాలర్లకు ఫోర్స్ ఇండియాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. గతంలో ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఉన్న వాటాను కూడా తొలగించడంతో ఆ జట్టుతో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment