సూపర్‌ పెరెజ్‌ | Sergio Perez keeps Baku F1 podium after stewards | Sakshi
Sakshi News home page

సూపర్‌ పెరెజ్‌

Published Mon, Apr 30 2018 8:25 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

Sergio Perez keeps Baku F1 podium after stewards - Sakshi

బాకు (అజర్‌బైజాన్‌): ఒకటా... రెండా... ఏకంగా 36 రేసుల తర్వాత భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్‌ ఓ ఫార్ములావన్‌ రేసులో టాప్‌–3లో నిలిచాడు. ఆదివారం జరిగిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి రేసులో ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ మూడో స్థానాన్ని సంపాదించాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్‌ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో పూర్తి చేశాడు. 2016లో బాకు వేదికగా జరిగిన యూరోపియన్‌ గ్రాండ్‌ప్రిలో చివరిసారి పెరెజ్‌ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నాడు. హామిల్టన్‌ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement