హామిల్టన్ పై దర్యాప్తు | Monza race winner Hamilton and Mercedes team mate Rosberg are under investigation | Sakshi
Sakshi News home page

హామిల్టన్ పై దర్యాప్తు

Published Sun, Sep 6 2015 7:42 PM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

హామిల్టన్ పై దర్యాప్తు - Sakshi

హామిల్టన్ పై దర్యాప్తు

విజయవంతంగా రేస్ ముగించిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్, అతని సహచరుడు రోస్ బర్డ్ పై ఫార్ములా వన్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. రేస్ కు ముందు నిర్నీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉండటమే దీనికి కారణమని ప్రాధమికంగా తెలుస్తోంది. రేస్ కు ముందు ఎఫ్ వన్ కారు టైర్ లో 19.5psi వత్తిడి ఉండాలి. అయితే.. మెర్సిడెజ్ కార్లు రెండింటిలోనూ నిర్ణీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై మెర్సిడెజ్ అధికారులకు ఎఫ్ఐఎ ప్రతినిధి జో బాయర్ రిపోర్టు అందించాడు. దీనిపై విచారణ కొనసాగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement