ఈ ఫోన్‌ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు! | Oppo to launch new selfie focused mid range phone in India today | Sakshi
Sakshi News home page

ఈ ఫోన్‌ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు!

Published Thu, Jan 28 2016 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

ఈ ఫోన్‌ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు!

ఈ ఫోన్‌ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు!

ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ 'అప్పో' సరికొత్త ఎఫ్ సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఫొటోగ్రఫీ సెంట్రల్ ఫీచర్‌గా వెలువడుతున్న ఈ ఫోన్లు గురువారం మార్కెట్‌లో విడుదలకానున్నాయి. ఎఫ్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెడుతున్న తొలిఫోన్ 'అప్పో ఎఫ్‌1'..

భారత్‌లో 'అప్పో ఎఫ్‌1' ధరను ఇంకా కంపెనీ ఖరారు చేయనప్పటికీ.. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ధర 250 డాలర్లు/229 యూరోలు (సుమారు రూ. 17వేలు)గా ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 20వేలుగా ఉంటుందని భావిస్తున్నారు.

అప్పో ఎఫ్‌1లో ప్రధాన విశేషం.. ఈ ఫోన్‌లోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.  వైడ్‌ ఎఫ్/2.0 లెన్స్,  1/4 అంగుళాల సెన్సర్ తో రానున్న ఈ ఫ్రంట్‌ కెమెరాతో సాండర్డ్‌ 5 మెగాపిక్సెల్ కెమెరా కన్నా మెరుగైన ఫొటోలు తీయవచ్చునని కంపెనీ చెప్తోంది. తక్కువ లైంటింగ్‌ ఉన్న పరిసరాల్లోనూ మంచి సెల్ఫీలు దిగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అప్పో ఎఫ్‌1లో స్క్రీన్‌ ఫ్లాష్ ఫీచర్ ఉంది. దీనివల్ల మొత్తం మొబైల్ డిస్‌ప్లే కెమెరా ఫ్లాష్‌లాగా వ్యవహరించి.. చీకటిలోనూ మెరుగైన సెల్ఫీ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇక ఈ ఫోన్ డిజైన్‌ విషయానికొస్తే దీని బాడీ మిశ్రమ లోహంతో రూపొందించారు. ఐదు అంగుళాల డిస్‌ప్లే, దానిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఈ మొబైల్ ఫోన్ రూపొందింది. బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ అక్టా కోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్‌ ఉన్న ఈ ఫోన్‌లో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరెజ్ ఉంటుంది. 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ను సపోర్ట్ చేస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement