oppo phones
-
ఫోనుకు బదులు సబ్బు, సర్ఫ్.. అమెజాన్‌కు మొట్టికాయ
సాక్షి, ముషీరాబాద్: ఫోనుకు బదులుగా సబ్బు, సర్ఫ్ ను వినియోగదారుడికి అందించిన అమెజాన్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం–2 మొట్టికాయ వేసింది. ఫోన్ విలువతో పాటు రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఫోరం సభ్యుడు పీవీటీఆర్ జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. హైదరాబాద్ బీకేగూడ పార్కు వద్ద నివసించే ప్రైవేటు ఉద్యోగి అయిన పి.విజయ్‌కుమార్ 2020 డిసెంబర్ 19న అమెజాన్‌లో ఒప్పో సెల్‌ఫోన్‌ను రూ.11,990 చెల్లించి ఆర్డర్ చేశారు. అయితే ఫోనుకు బదులుగా ఒక సబ్బు, సర్ఫ్ ప్యాకెట్‌తో కూడిన పార్సల్ అందింది. వెంటనే విజయ్‌కుమార్ అమెజాన్‌కు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అమెజాన్ నుంచి స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై ఆమెజాన్ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్‌కు ఫోరం నోటీసులు జారీ చేసింది. వారి తరుపున హాజరైన న్యాయవాదులు ఫిర్యాదు దారుడికి సరైన సాక్ష్యాలు చూపించక పోవడంతో వినయ్‌కుమార్ చెల్లించిన రూ.11,990లకు 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, ఫిర్యాదు దారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం2 ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో తీర్పు.. తెలంగాణ వినియోగదారుల ఫోరం సభ్యుడు పీవీటీఆర్.జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తెలుగులో తీర్పును వెలువరించింది. -
ఒప్పో బడ్జెట్ ఫోన్‌పై ధర తగ్గింపు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో గత నెల అక్టోబర్‌లో ఒప్పో ఏ15 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపును అందించారు. రియల్మీ, షియోమి, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒప్పో ఏ15 ధరను తగ్గించినట్లు తెలుస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల వంటి ఫీచర్లను అందించారు. ఒప్పో ఏ15ను ఇండియాలో విడుదల చేసినప్పుడు 2జీబీ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ కి 9,490 రూపాయలు కాగా, 3జీబీ + 32జీబీ మొబైల్ కి 10,990 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ధరను రూ .1,000 తగ్గించింది. దీనితోఒప్పో ఏ15 2జీబీ మోడల్ ధర రూ .8,490 కాగా, 3జీబీ మోడల్ ధర 9,990 రూపాయలు. కొత్త ధర ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (చదవండి: పబ్ జీ టోర్నీలో గెలిస్తే రూ.6 కోట్లు) ఒప్పో ఏ15 ఫీచర్స్ ఈ మొబైల్ లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఒప్పో ఏ15 6.5-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లేను 1600 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అమర్చారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. -
జియో అద్భుత ఆఫర్ : 3.2 టీబీ 4జీ డేటా
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఆఫర్ - జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్‌ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. జూన్ 28 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్.. ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు... 1800 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్‌బ్యాక్ ఓచర్ల రూపంలో పొందనున్నారు. జియో మనీ క్రెడిట్.... 13వ, 26వ, 39వ రీఛార్జ్‌ల అనంతరం 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1800 రూపాయలు క్రెడిట్ కానున్నాయి. పార్టనర్ కూపన్ బెనిఫిట్స్... మేక్మైట్రిప్ నుంచి 1300 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనునఆనయి. ఆఫర్ ప్రారంభ తేదీ.. 2018 జూన్ 28 మైజియో యాప్‌లో ఉన్న ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వారికి రూ.50 క్యాష్ బ్యాక్ ఓచర్లు వెంటనే పొందవచ్చు. రూ.299 రీఛార్జ్‌పై ప్రస్తుతం జియో 126 జీబీ డేటాను అందిస్తోంది. -
ఈ ఫోన్ కొంటే సెల్ఫీలే సెల్ఫీలు!
ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ 'అప్పో' సరికొత్త ఎఫ్ సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఫొటోగ్రఫీ సెంట్రల్ ఫీచర్‌గా వెలువడుతున్న ఈ ఫోన్లు గురువారం మార్కెట్లో విడుదలకానున్నాయి. ఎఫ్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెడుతున్న తొలిఫోన్ 'అప్పో ఎఫ్1'.. భారత్‌లో 'అప్పో ఎఫ్1' ధరను ఇంకా కంపెనీ ఖరారు చేయనప్పటికీ.. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ధర 250 డాలర్లు/229 యూరోలు (సుమారు రూ. 17వేలు)గా ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 20వేలుగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పో ఎఫ్1లో ప్రధాన విశేషం.. ఈ ఫోన్లోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. వైడ్ ఎఫ్/2.0 లెన్స్, 1/4 అంగుళాల సెన్సర్ తో రానున్న ఈ ఫ్రంట్ కెమెరాతో సాండర్డ్ 5 మెగాపిక్సెల్ కెమెరా కన్నా మెరుగైన ఫొటోలు తీయవచ్చునని కంపెనీ చెప్తోంది. తక్కువ లైంటింగ్ ఉన్న పరిసరాల్లోనూ మంచి సెల్ఫీలు దిగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అప్పో ఎఫ్1లో స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్ ఉంది. దీనివల్ల మొత్తం మొబైల్ డిస్ప్లే కెమెరా ఫ్లాష్‌లాగా వ్యవహరించి.. చీకటిలోనూ మెరుగైన సెల్ఫీ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికొస్తే దీని బాడీ మిశ్రమ లోహంతో రూపొందించారు. ఐదు అంగుళాల డిస్ప్లే, దానిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఈ మొబైల్ ఫోన్ రూపొందింది. బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో ఉంటుంది. 3 జీబీ ర్యామ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ అక్టా కోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉన్న ఈ ఫోన్లో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరెజ్ ఉంటుంది. 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ను సపోర్ట్ చేస్తుంది.