ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో గత నెల అక్టోబర్‌లో ఒప్పో ఏ15 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపును అందించారు. రియల్‌మీ, షియోమి, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒప్పో ఏ15 ధరను తగ్గించినట్లు తెలుస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల వంటి ఫీచర్లను అందించారు. ఒప్పో ఏ15ను ఇండియాలో విడుదల చేసినప్పుడు 2జీబీ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ కి 9,490 రూపాయలు కాగా, 3జీబీ + 32జీబీ మొబైల్ కి 10,990 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ధరను రూ .1,000 తగ్గించింది. దీనితోఒప్పో ఏ15 2జీబీ మోడల్ ధర రూ .8,490 కాగా, 3జీబీ మోడల్ ధర 9,990 రూపాయలు. కొత్త ధర ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (చదవండి: పబ్ జీ టోర్నీలో గెలిస్తే రూ.6 కోట్లు)
ఒప్పో ఏ15 ఫీచర్స్
ఈ మొబైల్ లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఒప్పో ఏ15 6.5-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అమర్చారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment