Oppo mobiles
-
ఒప్పో ఏ55 5జీ వచ్చేసింది!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ55 5జీని చైనాలో విడుదల చేసింది. ఒప్పో ఏ55 5జీ 6జీబీ ర్యామ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ఫోన్ బిగ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) ఒప్పో ఏ55 5జీ ఫీచర్స్ డ్యూయల్ సిమ్ ఒప్పో ఏ55 5జీ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే కలర్ఓఎస్ 11పై నడుస్తుంది. ఇది 6.5-అంగుళాల ఎల్సిడి వాటర్‌డ్రాప్-స్టైల్ హెచ్డి ప్లస్(720x1,600 పిక్సెల్స్) డిస్ ప్లేను అందించారు. ఇది 6 జీబీ ర్యామ్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ(1టీబీ వరకు పెంచుకోవచ్చు) ఉంది. ఒప్పో ఏ55 5జీలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ఎఫ్/2.2 ఎపర్చరుతో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఒప్పో ఏ55 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5(802.11ac), బ్లూటూత్ v5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. దీని బరువు 186 గ్రాములు. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కొత్త ఒప్పో ఏ55 5జీలో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర చైనాలో సిఎన్ వై1,599 (సుమారు రూ.18,000)గా ఉంది. ఇది బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
జనవరి 18న లాంచ్ కానున్న ఒప్పో రెనో 5 ప్రో
న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో 5జీ మొబైల్ ను ఇండియాలో జనవరి 18న మధ్యాహ్నం 12:30గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పో రెనో 5 5జీ సిరీస్ గత నెలలో చైనాలో లాంచ్ అయింది. ఒప్పో రెనో 5 4జీ వేరియంట్‌ను కొన్ని రోజుల క్రితం వియత్నాంలో విడుదల చేశారు. ప్రస్తుతానికి ఒప్పో రెనో 5 ప్రో 5జీ మాత్రమే భారతదేశంలో లాంచ్ ప్రకటించింది. అయితే సమీప భవిష్యత్తులో కంపెనీ ఇతర మోడళ్లను దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్) ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్: ఒప్పో రెనో 5ప్రో 5జీ యొక్క ఇండియన్ వేరియంట్ లక్షణాలు చైనీస్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ ఆండ్రాయిడ్ 11లో కలర్ఓఎస్ 11.1 డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో నడుస్తుంది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. రెనో 5ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ చేత పనిచేయనుంది. ఏఆర్ఎం జీ77 జీపీయూతో పాటు 12జీబీ ర్యామ్ ఉంటుంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ మాక్రో షూటర్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ పోర్ట్రెయిట్ షూటర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 32 ఎంపీ కెమెరా ఉంది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 లాంచ్ ఎప్పుడంటే!) దింట్లో 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో 4,350ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ల విషయానికి వస్తే జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటి సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా(సుమారు రూ.38,200) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,799 యువాన్లుగా(సుమారు రూ.42,700) నిర్ణయించారు. -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
రూ.15 వేలకే ఒప్పో 5జీ మొబైల్
ఒప్పో ఏ53 4జీ మొబైల్ నీ ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా చైనాలో ఒప్పో ఏ53 5జీ వెర్షన్ మొబైల్ ని లాంచ్ చేసింది. 15వేలకే 5జీ మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే ఉంది. వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90 హెర్ట్జ్‌గా ఉంది. ఒప్పో ఏ53 5జీ 4జీబీ + 128జీబీ వేరియెంట్ ధర జెడి.కామ్‌లో చైనా యువాన్లు1,299(సుమారు రూ.14,600). ఇది 6జీబీ + 128జీబీ వేరియెంట్లో కూడా లభిస్తుంది. భారత్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.(చదవండి: ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్) ఒప్పో ఏ53 5జీ ఫీచర్స్ ఒప్పో ఏ53 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కలర్ఓఎస్ 7.2పై పనిచేస్తుంది. ఇది 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్డి ప్లస్(1,080x2,400) పిక్సెల్స్ డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఏ53 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ వేరియంట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ఎఫ్/2.0 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఒప్పో ఏ53 5జీలో 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,040 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని బరువు 175 గ్రాములగా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11ఎ/బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది లేక్ గ్రీన్, సీక్రెట్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్
అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఎ15ఎస్, ఒప్పో ఎ15 సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. డిసెంబర్ 21 నుంచి ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఒప్పోఎ15ఎస్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,490. ఇది డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్ మరియు రెయిన్ బో సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: క్యూఎల్ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ) ఒప్పో ఎ15ఎస్ ఫీచర్స్: ఒప్పో ఎ15ఎస్ కలర్ఓఎస్ 7.2పై నడుస్తుంది. ఇది 6.52-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఒప్పో ఎ15ఎస్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఒప్పో ఎ15ఎస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ అభించనుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే చెల్లుతాయి. -
ఒప్పో బడ్జెట్ ఫోన్‌పై ధర తగ్గింపు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో గత నెల అక్టోబర్‌లో ఒప్పో ఏ15 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపును అందించారు. రియల్మీ, షియోమి, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒప్పో ఏ15 ధరను తగ్గించినట్లు తెలుస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల వంటి ఫీచర్లను అందించారు. ఒప్పో ఏ15ను ఇండియాలో విడుదల చేసినప్పుడు 2జీబీ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ కి 9,490 రూపాయలు కాగా, 3జీబీ + 32జీబీ మొబైల్ కి 10,990 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ధరను రూ .1,000 తగ్గించింది. దీనితోఒప్పో ఏ15 2జీబీ మోడల్ ధర రూ .8,490 కాగా, 3జీబీ మోడల్ ధర 9,990 రూపాయలు. కొత్త ధర ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (చదవండి: పబ్ జీ టోర్నీలో గెలిస్తే రూ.6 కోట్లు) ఒప్పో ఏ15 ఫీచర్స్ ఈ మొబైల్ లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఒప్పో ఏ15 6.5-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లేను 1600 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అమర్చారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. -
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్‌లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్‌లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్‌కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్‌గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్‌లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
మాదాపూర్‌లో టాలీవుడ్ నటి సందడి
హైదరాబాద్: నగరంలోని ఓ మొబైల్ షోరూంలో టాలీవుడ్ నటి రెజీనా కసాండ్ర బుధవారం సందడి చేశారు. ఆత్యాధునిక సాంకేతిక టెక్నాలోజితో ఒప్పో మొబైల్ రూపొందించినట్లు రెజీనా పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఆమె బుధవారం ఎఫ్-1 ఫోర్ట్ మొబైల్స్ ప్రారంభించారు. తమ అభిమాన తార వచ్చిందని తెలియగానే చాలా సంఖ్యలో అభిమానులు ఒప్పో స్టోర్ వద్దకు తరలివచ్చారు. రెజీనాను దగ్గరి నుంచి చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ 3 జీబీ ర్యామ్ ట్రిపుల్ ప్లాట్ కార్ట్ లాంటి సదుపాయాలు ఈ మొబైల్లో ఉన్నాయని ఆమె తెలిపారు. అధిక స్పష్టత ఉండే బ్లూరే వీడియోలు సైతం ఈ మొబైల్స్ లో అద్భుతంగా ప్లే అవుతాయని పేర్కొన్నారు. ఈవెంట్లో భాగంగా ఒప్పో బృందంతో నటి రెజీనా సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒప్పో మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జోన్ , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఒప్పొ ‘జాయ్ 3’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పొ ‘జాయ్ 3’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7,990. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4.5 అంగుళాల తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
భారత్‌లో ఒప్పొ ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పొ భారత్‌లో హ్యాండ్సెట్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, ప్లాంట్ ఏర్పాటుకు ఇదే అనువైన సమయమని ఒప్పొ మొబైల్స్ ఇండియా సీఈఓ టామ్ లూ తెలిపారు. తమ మార్కెట్ ప్రాథామ్యాలలో భారత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమ ప్రభావంతో షియోమీ, కూల్‌ప్యాడ్, జియోనీ వంటి కంపెనీలు కూడా దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. భారత్‌లో గతేడాది జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఒప్పొ, ఇప్పటిదాకా 10 మోడ ళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పొ ఈ ఏడాది సర్వీస్ సెంటర్ల సంఖ్యను 120 నుంచి 200కు పెంచాలని, అలాగే మొబైల్ విక్రయాలను 15 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.