మాదాపూర్లో టాలీవుడ్ నటి సందడి | Regina Cassandra unveils oppo store mobiles | Sakshi
Sakshi News home page

మాదాపూర్లో టాలీవుడ్ నటి సందడి

Published Thu, Aug 4 2016 9:48 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

మాదాపూర్లో టాలీవుడ్ నటి సందడి - Sakshi

మాదాపూర్లో టాలీవుడ్ నటి సందడి

హైదరాబాద్‌: నగరంలోని ఓ మొబైల్ షోరూంలో టాలీవుడ్ నటి రెజీనా కసాండ్ర బుధవారం సందడి చేశారు. ఆత్యాధునిక సాంకేతిక టెక్నాలోజితో ఒప్పో మొబైల్ రూపొందించినట్లు రెజీనా పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఆమె బుధవారం ఎఫ్-1 ఫోర్ట్ మొబైల్స్ ప్రారంభించారు. తమ అభిమాన తార వచ్చిందని తెలియగానే చాలా సంఖ్యలో అభిమానులు ఒప్పో స్టోర్ వద్దకు తరలివచ్చారు. రెజీనాను దగ్గరి నుంచి చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ 3 జీబీ ర్యామ్ ట్రిపుల్ ప్లాట్ కార్ట్ లాంటి సదుపాయాలు ఈ మొబైల్‌లో ఉన్నాయని ఆమె తెలిపారు. అధిక స్పష్టత ఉండే బ్లూరే వీడియోలు సైతం ఈ మొబైల్స్ లో అద్భుతంగా ప్లే అవుతాయని పేర్కొన్నారు. ఈవెంట్లో భాగంగా ఒప్పో బృందంతో నటి రెజీనా సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒప్పో మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జోన్ , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement