చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో రెనో 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇష్టపడేవారి కోసం ఒప్పో ఈ రెండు ఫోన్‌లలో చాలా ఏఐ ఫీచర్లను అందించింది.
కంపెనీ ఒప్పో రెనో 12ని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేసింది. దీని ధర రూ.32,999. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం జూలై 25 నుంచి భారత్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 12 ప్రో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999. దీని సేల్ జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో కొనుగోలుపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. రూ. 4000 తక్షణ తగ్గింపుతో సిరీస్ బేస్ వేరియంట్‌ను రూ. 28,999 లకే కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 12 ఫీచర్లు
⇒ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్
⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓస్ 14.1
⇒ 50 + 8 + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా
⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ
⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు
ఒప్పో రెనో 12 ప్రో ఫీచర్లు
⇒ 6.7-అంగుళాల ఫుల్ హోచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్‌ఓస్ 14.1
⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్
⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు
⇒ 50 + 8 + 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా
⇒ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా
⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment