PC: Daily Sabah.com
ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టినా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో 11వ విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచి వరుసగా ఐదో విజయం నమోదు చేశాడు.
12వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన వెర్‌స్టాపెన్ అదే జోరులో నిర్ణీత 53 ల్యాప్‌ల రేసును గంటా 20 నిమిషాల 27.511 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం వెర్‌స్టాపెన్ 335 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లెక్‌లెర్క్ 219 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 2న జరుగుతుంది.
చదవండి: Asia Cup 2022: ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment