రెడ్‌బుల్-మెర్సెడెస్ టాప్ రేసర్లు మరోసారి దూకుడు చర్యలతో వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, రెడ్‌బుల్ రేసర్ వెర్‌స్టాపెన్ కార్ల ‘ఢీ’యాక్షన్.. పరస్పర విమర్శలతో వేడెక్కిస్తోంది. ‘‘ఇవాళ నా అదృష్టం బాగుండి బతికా. హలోకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకుంటే ఏమైపోయేవాడినో..’’ అంటూ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ లూయిస్ హామిల్టన్ చెబుతున్నాడు.
ఆదివారం వారియంట్ డెల్ రెటాయిలియో రేసుకోర్టులో జరిగిన ఇటలీ పార్కో డీ మోంజా(ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1) రేసులో మెక్‌లారెన్ రేసర్ డానియల్ రిక్కియార్డో(ఆసీస్-ఇటాలియన్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 53 ల్యాప్‌లతో జరిగిన రేసులో.. 26వ ల్యాప్ వద్ద 225 కిలోమీటర్ల వేగంతో దూసుకుకొచ్చిన రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్‌స్టాపెన్ రేస్ కారు.. మెర్సెడెస్ రేసర్ హామిల్టన్ రేస్‌కారును ఎక్కేసింది. రెండు వాహనాలు ట్రాక్ తప్పి పక్కకు దూసుకెళ్లాయి. 750 కేజీల వెహికిల్ ముందుభాగం పచ్చడికాగా.. క్రాష్‌లో హామిల్టన్ ప్రాణాలు పోయి ఉంటాయని అంతా కంగారుపడ్డారు!. కానీ, హలొ డివైజ్ వల్ల పెద్దగాయాలేవీ కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు హామిల్టన్. క్రాష్ తర్వాత తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చిన హామిల్టన్.. ఆ తర్వాత మెడ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు.
Another hugely dramatic moment in the Verstappen/Hamilton title battle 💥😮#ItalianGP 🇮🇹 #F1 pic.twitter.com/P4J4bN6wX2
— Formula 1 (@F1) September 12, 2021
హలో.. వివాదం
హలొ అనేది సేఫ్టీ డివైజ్. క్రాష్ ప్రొటెక్షన్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఓపెన్ వీల్ రేసింగ్ సిరీస్‌లలో వీటిని వాడ్తారు. డ్రైవర్ తల భాగంలో కర్వ్ షేప్‌లో ఉంటుంది ఇది. 2016-2017 జులై మధ్యకాలంలో ఈ డివైజ్‌ను టెస్ట్‌లకు ఉపయోగించారు. ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో 2018 ఎఫ్‌ఐఏ సీజన్ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ రేసులో దీన్ని తప్పనిసరి చేశారు. ఇండీకార్ హలొ మాత్రం ఎయిరోస స్క్రీన్ కోసం వేరే ఫ్రేమ్‌లో ఉంటుంది. అయితే దీని వాడకంపై వివాదం నడుస్తున్నా.. ఇలా ప్రాణాలు కాపాడటం ఇది రెండోసారి!.
గతంలో ఈ డివైజ్‌ను తీసుకొచ్చిన కొద్దిరోజులకే రేసర్ చార్లెస్ లెక్లెరిక్ పప్రాణాలు కాపాడింది. స్పా ఫ్రాన్కోర్‌చాంప్స్(2018) రేస్ సందర్భంగా ఫస్ట్ ల్యాప్‌లోనే ఫెర్నాండో అలోన్సో ‘మెక్‌లారెన్’తో క్రాష్ అయినప్పటికీ.. ఆ ప్రమాదం నుంచి లెక్లెరిక్ చిన్నగాయం కూడా కాకుండా బయటపడగలిగాడు. ఇక వెర్‌స్టాపెన్-హామిల్టన్ మధ్య జరిగిన క్రాష్ వివాదానికి తెరలేపింది. వెర్‌స్టాపెన్‌కు పెనాల్టీ విధించినప్పటికీ.. మెర్సిడెస్ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా భావించాలని కోరుతోంది.
చదవండి: డేంజరస్ క్రాష్.. సిగ్గులేకుండా హామిల్టన్ సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment