Charles Leclerc
-
లెక్లెర్క్ జోరు...
ఆస్టిన్ (టెక్సాస్): ఫార్ములావన్ తాజా సీజన్‌లోని తొలి 10 రేసుల్లో 7 విజయాలు సాధించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. గత తొమ్మిది రేసుల్లో వెర్స్టాపెన్ ఒక్క రేసులోనూ విజయం అందుకోలేకపోయాడు. మరోవైపు ఇతర జట్ల డ్రైవర్లు అనూహ్యంగా పుంజుకొని వెర్‌స్టాపెన్‌కు గట్టి సవాలు విసరుతున్నారు. సీజన్‌లోని 19వ రేసుగా జరిగిన యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ విజేతగా నిలిచాడు. నిరీ్ణత 56 ల్యాప్‌లను లెర్లెర్క్ అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా ఒక గంట 35 నిమిషాల 09.639 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లోని లెక్లెర్క్కిది మూడో విజయం కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసు మొదలుపెట్టిన లాండో నోరిస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ జట్టుకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానాన్ని సంపాదించాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్‌కు మూడో స్థానం లభించింది. వాస్తవానికి నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. అయితే రేసు చివరి దశలో నోరిస్ ట్రాక్ బయటకు వచ్చాడు. దాంతో నిర్వాహకులు అతనిపై ఐదు సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో నాలుగో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌కు మూడో స్థానం ఖరారు కాగా... మూడోస్థానం పొందిన నోరిస్ నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ రేసులో నిరాశ ఎదురైంది. హామిల్టన్ తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 19 రేసులు ముగిశాయి. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్; 354 పాయింట్లు), నోరిస్ (మెక్లారెన్; 297 పాయింట్లు), లెక్లెర్క్ (ఫెరారీ; 275 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్‌లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్‌లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్‌ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్‌లో అప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్‌కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్‌కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
మళ్లీ లెక్లెర్క్కే ‘పోల్’
బాకు (అజర్బైజాన్): క్వాలిఫయింగ్‌లో తనకెంతో కలిసొచి్చన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ వరుసగా నాలుగో ఏడాది రాణించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.365 సెకన్లలో ముగించాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో గత మూడేళ్లు ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించినా లెక్లెర్క్కు మాత్రం టాప్ ర్యాంక్ లభించలేదు. నాలుగో ప్రయత్నంలో లెక్లెర్క్కు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. మెక్లారెన్ జట్టుకు చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానం నుంచి... ఫెరారీకి చెందిన కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఏడు రేసుల్లో గెలుపొందాడు. లెక్లెర్క్, లాండో నోరిస్, లూయిస్ హామిల్టన్ రెండేసి రేసుల్లో విజేతగా నిలువగా... కార్లోస్ సెయింజ్, జార్జి రసెల్, ఆస్కార్ పియాస్ట్రి ఒక్కో రేసులో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి గ్రిడ్ పొజిషన్స్: 1. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 2. ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్), 3. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), 4. సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్), 5. జార్జి రసెల్ (మెర్సిడెస్), 6. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 7. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 8. ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మారి్టన్), 9. ఫ్రాంకో కొలాపింటో (విలియమ్స్), 10. అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), 11. ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్), 12. యుకీ సునోడా (వీసా క్యాష్), 13. పియరీ గ్యాస్లీ (అలై్పన్), 14. నికో హుల్కెన్‌బర్గ్ (మనీగ్రామ్), 15. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మారి్టన్), 16. డానియల్ రికార్డో (వీసా క్యాష్), 17. లాండో నోరిస్ (మెక్లారెన్), 18. వాల్తెరి బొటాస్ (స్టేక్ ఎఫ్1), 19. గ్వాన్యు జూ (స్టేక్ ఎఫ్1), 20. ఎస్టెబన్ ఒకాన్ (అల్పైన్). అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య: 51 ల్యాప్ దూరం: 6.003 కి.మీ. మొత్తం రేసు దూరం: 3–6.049 కి.మీ 2023 విజేత: సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్) బెస్ట్ ల్యాప్ రికార్డు: లెక్లెర్క్ (1ని:43.009 సెకన్లు; 2019లో) -
ఫెరారీ సవారీ.. ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన లెక్లెర్క్
ఫార్ములావన్ ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ టైటిల్ గెలుచుకున్నాడు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్.. వాయువేగంతో ముందుకు సాగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. గత వారం డచ్ గ్రాండ్‌ప్రి టైటిల్ దక్కించుకున్న లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకోగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ‘టాప్’లో ఉన్న వెర్స్టాపెన్ ఆరో స్థానానికే పరిమితమయ్యాడు. మోంజా (ఇటలీ): ఫార్ములావన్ సీజన్ 16వ రేసు ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో లెక్లెర్క్ అందరికంటే ముందుగా నిరీ్ణత 53 ల్యాప్‌లను 1 గంటా 14 నిమిషాల 40.727 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఫెరారీ జట్టు ప్రధాన కేంద్రమైన ఇటలీలో ఆ జట్టుకు టైటిల్ దక్కడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2019లో లెక్లెర్కే ఫెరారీ జట్టుకు ఇక్కడ టైటిల్ అందించాడు.నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన లెక్లెర్క్ తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్లాడు. గత కొన్ని రేసుల నుంచి టాప్ త్రీలో చోటు దక్కించుకోలేకపోతున్న లెక్లెర్క్ ఈసారి సత్తా చాటగా... గత వారం డచ్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 గంటా 14 నిమిషాల 43.391 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానం దక్కించుకున్న లెక్లెర్క్తో పోల్చుకుంటే... పియాస్ట్రి 2.664 సెకన్లు ఆలస్యంగా గెలుపు గీత దాటాడు. మొత్తం 53 ల్యాప్‌లు గల 306.720 కిలోమీటర్ల ఈ రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన నోరిస్ 1 గంటా 14 నిమిషాల 46.880 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానం దక్కించుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్ప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 గంట 15 నిమిషాల 18.659 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో మరో ఎనిమిది రేసులు మిగిలుండగా... వెర్స్టాపెన్ 303 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా... 241 పాయింట్లతో నోరిస్ రేండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో ఉన్న డ్రైవర్ల మధ్య ప్రస్తుతం 62 పాయింట్ల వ్యత్యాసం ఉంది. రేసు రేసు ఆరంభంలోనే లెక్లెర్క్ ఆధిక్యం దక్కించుకోగా... మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ కూడా వాయువేగంతో దూసుకెళ్లాడు. అయితే రెండో మలుపు వద్ద నోరిస్‌ను మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చాడు.చివరకు వరకు పియాస్ట్రి అదే జోరు కొనసాగించినా.. లెక్లెర్క్ను అందుకోలేకపోయాడు. కార్లోస్ సెయింజ్ జూనియర్ (ఫెరారీ) 1 గంట 14 నిమిషాల 56.348 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలవగా... బ్రిటన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) 1 గంట 15 నిమిషాల 3.547 సెకన్లలో రేసును ముగించి ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఈ రేసు ద్వారానే ఫార్ములావన్ అరంగేట్రం చేసిన విలియమ్స్ రేసింగ్ జట్టు డ్రైవర్ ఫ్రాంకో కొలాపింటో 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న బాకు సిటీలో జరుగుతుంది. -
Formula One: లెక్లెర్క్కు ఏడో ‘పోల్’
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ తాజా సీజన్లో క్వాలిఫయింగ్ సెషన్లో రాణించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఏడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1ని:30.872 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. -
Austrian Grand Prix: లెక్లెర్క్ ఖాతాలో మూడో విజయం
ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్బర్గ్లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్లెర్క్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
లెక్లెర్క్కు ఆరో పోల్ పొజిషన్... నేడు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ క్వాలిఫయింగ్ సెషన్స్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మరోసారి సత్తా చాటుకున్నాడు. బాకు నగరంలో శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.359 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీజన్లో లెక్లెర్క్కిది ఆరో పోల్ పొజిషన్ కావడం విశేషం. సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం ఏడు రేసులు జరగ్గా... వెర్స్టాపెన్ నాలుగు రేసులో, లెక్లెర్క్ రెండు రేసుల్లో, పెరెజ్ ఒక రేసులో విజేతగా నిలిచారు. -
‘మొనాకో’ విజేత పెరెజ్
మోంటెకార్లో: పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ రేసులో పెరెజ్ 64 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా గంటా 56 నిమిషాల 30.265 సెకన్లలో ముగించి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వర్షం కారణంగా 77 ల్యాప్‌ల రేసును 64 ల్యాప్‌లకు కుదించారు. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ముగ్గురు డ్రైవర్లు అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), మిక్ షుమాకర్ (హాస్), మాగ్నుసన్ (హాస్) రేసును పూర్తి చేయలేకపోయారు. తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. చదవండి: Chamundeswaranath: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు -
'మీ అభిమానం తగలెయ్య.. రెండున్నర కోట్ల వాచ్ కొట్టేశారు'
ఫార్ములా వన్ స్టార్ చార్లెస్ లెక్లెర్కు చేదు అనుభవం ఎదురైంది. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. కొట్టేసిన ఆ వాచ్ పేరు రిచర్డ్ మిల్లే.. దాని ఖరీదు ఇండియన్ కరెన్సీలో అక్షరాలా దాదాపు రూ.2.4 కోట్లకు పైగా. అభిమానం పేరుతో కలవడానికి వచ్చి విలువైన వస్తువును కొట్టేయడమేంటని చార్లెస్ తెగ బాధపడిపోయాడు. విషయంలోకి వెళితే.. వచ్చేవారం ఇటలీ వేదికగా జరగనున్న ఇమోలా గ్రాండ్ ప్రిక్స్ జరగనుంది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు చార్లెస్ లెక్లెర్ సోమవారం ఇటలీలో అడుగుపెట్టాడు. చార్లెస్‌తో పాటు స్నేహితులు, ట్రైనర్ ఆండ్రియా ఫెరారీ ఉన్నారు. టుస్కాన్ నగరం వియారెగియోలో చార్లెస్‌కు హోటల్ గది కేటాయించారు. అయితే అప్పటికే అతను ఉంటున్న హోటల్ ముందు తనను కలవడానికి జనాలు గూమికూడి ఉన్నారు. వారి అభిమానానికి మురిసిపోయిన చార్లెస్ స్వయంగా వారినిక కలవడానికి వచ్చాడు. అయితే ఆ గుంపులో నుంచే ఒక తెలియని వ్యక్తి చార్లెస్ చేతికున్న వాచ్‌ను కొట్టేశాడు. తన వాచ్ కొట్టేసిన విషయాన్ని చార్లెస్ స్వయంగా పోలీసులకు చెప్పి రిపోర్ట్ చేశాడు. చార్లెస్ రిపోర్డు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా నిజంగానే దొంగతనం చేశారా.. లేక ముందుస్తు ప్లాన్ అమలు చేసి ఈ పని చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి: Pele: మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం! -
Formula 1: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి విజేత లెక్లెర్క్
Australian GP: ఫార్ములావన్ తాజా సీజన్లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ రెండో టైటిల్ సాధించాడు. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ (మొనాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన లెక్లెర్క్ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. చదవండి: IPL 2022: చెలరేగిన పృథ్వీ షా, వార్నర్.. ఢిల్లీ ధనాధన్! It’s a win ❤️ Soooo happy! Perfect weekend. Forza Ferrari @ScuderiaFerrari pic.twitter.com/Hzhab92JwQ — Charles Leclerc (@Charles_Leclerc) April 10, 2022