అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా నాలుగో ఏడాది ఘనత
క్వాలిఫయింగ్‌లో మెరిసిన ఫెరారీ జట్టు డ్రైవర్
నేడు సీజన్‌లోని 17వ రేసుకు సర్వం సిద్ధం
బాకు (అజర్‌బైజాన్): క్వాలిఫయింగ్‌లో తనకెంతో కలిసొచి్చన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ వరుసగా నాలుగో ఏడాది రాణించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.365 సెకన్లలో ముగించాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు.
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో గత మూడేళ్లు ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించినా లెక్‌లెర్క్‌కు మాత్రం టాప్ ర్యాంక్ లభించలేదు. నాలుగో ప్రయత్నంలో లెక్‌లెర్క్‌కు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. మెక్‌లారెన్ జట్టుకు చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానం నుంచి... ఫెరారీకి చెందిన కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఏడు రేసుల్లో గెలుపొందాడు. లెక్‌లెర్క్, లాండో నోరిస్, లూయిస్ హామిల్టన్ రెండేసి రేసుల్లో విజేతగా నిలువగా... కార్లోస్ సెయింజ్, జార్జి రసెల్, ఆస్కార్ పియాస్ట్రి ఒక్కో రేసులో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి గ్రిడ్ పొజిషన్స్: 1. చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), 2. ఆస్కార్ పియాస్ట్రి (మెక్‌లారెన్), 3. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), 4. సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్), 5. జార్జి రసెల్ (మెర్సిడెస్), 6. మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 7. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 8. ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మారి్టన్), 9. ఫ్రాంకో కొలాపింటో (విలియమ్స్), 10. అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), 11. ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్), 12. యుకీ సునోడా (వీసా క్యాష్), 13. పియరీ గ్యాస్లీ (అలై్పన్), 14. నికో హుల్కెన్‌బర్గ్ (మనీగ్రామ్), 15. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మారి్టన్), 16. డానియల్ రికార్డో (వీసా క్యాష్), 17. లాండో నోరిస్ (మెక్‌లారెన్), 18. వాల్తెరి బొటాస్ (స్టేక్ ఎఫ్1), 19. గ్వాన్యు జూ (స్టేక్ ఎఫ్1), 20. ఎస్టెబన్ ఒకాన్ (అల్పైన్).
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి వివరాలు
ల్యాప్‌ల సంఖ్య: 51
ల్యాప్ దూరం: 6.003 కి.మీ.
మొత్తం రేసు దూరం: 3–6.049 కి.మీ
2023 విజేత: సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్)
బెస్ట్ ల్యాప్ రికార్డు: లెక్‌లెర్క్
(1ని:43.009 సెకన్లు; 2019లో)
Comments
Please login to add a commentAdd a comment