Pole
-
నోరిస్‌కు పోల్ పొజిషన్
సింగపూర్: ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లొండా నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. నోరిస్ 1 గంట 29 నిమిషాల 525 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకోగా... రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 గంట 29 నిమిషాల 728 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన డ్రైవర్ల మధ్య కేవలం 0.203 సెకన్ల తేడా మాత్రమే ఉంది. బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 841 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 867 సెకన్లు), ఆస్కార్ పీస్ట్రి (మెక్లారెన్; 1 గంట 29 నిమిషాల 953 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. 24 రేసుల సీజన్లో సింగపూర్ గ్రాండ్ ప్రి 18వ రేసు కాగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం నెదర్లాండ్స్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత కొన్ని రేసులుగా నిలకడ కొనసాగిస్తున్న నోరిస్ 254 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 59 పాయింట్ల అంతరం ఉంది. మరో ఏడు రేసులు మిగిలుండగా... ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్íÙప్ ట్రోఫీ కైవసం చేసుకునే దిశగా ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్ ప్రి కీలకం కానుంది. -
మళ్లీ లెక్లెర్క్కే ‘పోల్’
బాకు (అజర్బైజాన్): క్వాలిఫయింగ్‌లో తనకెంతో కలిసొచి్చన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ వరుసగా నాలుగో ఏడాది రాణించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.365 సెకన్లలో ముగించాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో గత మూడేళ్లు ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించినా లెక్లెర్క్కు మాత్రం టాప్ ర్యాంక్ లభించలేదు. నాలుగో ప్రయత్నంలో లెక్లెర్క్కు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. మెక్లారెన్ జట్టుకు చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానం నుంచి... ఫెరారీకి చెందిన కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఏడు రేసుల్లో గెలుపొందాడు. లెక్లెర్క్, లాండో నోరిస్, లూయిస్ హామిల్టన్ రెండేసి రేసుల్లో విజేతగా నిలువగా... కార్లోస్ సెయింజ్, జార్జి రసెల్, ఆస్కార్ పియాస్ట్రి ఒక్కో రేసులో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి గ్రిడ్ పొజిషన్స్: 1. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 2. ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్), 3. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), 4. సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్), 5. జార్జి రసెల్ (మెర్సిడెస్), 6. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 7. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 8. ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మారి్టన్), 9. ఫ్రాంకో కొలాపింటో (విలియమ్స్), 10. అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), 11. ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్), 12. యుకీ సునోడా (వీసా క్యాష్), 13. పియరీ గ్యాస్లీ (అలై్పన్), 14. నికో హుల్కెన్‌బర్గ్ (మనీగ్రామ్), 15. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మారి్టన్), 16. డానియల్ రికార్డో (వీసా క్యాష్), 17. లాండో నోరిస్ (మెక్లారెన్), 18. వాల్తెరి బొటాస్ (స్టేక్ ఎఫ్1), 19. గ్వాన్యు జూ (స్టేక్ ఎఫ్1), 20. ఎస్టెబన్ ఒకాన్ (అల్పైన్). అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య: 51 ల్యాప్ దూరం: 6.003 కి.మీ. మొత్తం రేసు దూరం: 3–6.049 కి.మీ 2023 విజేత: సెర్జియోపెరెజ్ (రెడ్‌బుల్) బెస్ట్ ల్యాప్ రికార్డు: లెక్లెర్క్ (1ని:43.009 సెకన్లు; 2019లో) -
నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
సైదాబాద్: అతిగా మద్యం సేవించాడు. భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత విద్యుత్ స్థంభం ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. ఇప్పటికి ఈ విధంగా ఐదుసార్లు స్థానికులను, పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం మరోసారి మద్యం మత్తులో విద్యుత్ స్థంభం ఎక్కి దూకుతా.. దూకుతా.. అంటూ బెంబేలెత్తించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగరేణి కాలనీలో నివసించే దినసరి కూలి మోహన్‌బాబు (25) బుధవారం మద్యం సేవించి కాలనీలోని హైటెన్షన్ విద్యుత్ స్థంభం ఎక్కాడు. స్థానికులు గమనించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు అతనికి నచ్చచెప్పి కిందికి దించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంటసేపు అతని డ్రామా స్థానికంగా కలకలం సృష్టించింది. మరోసారి ఇలా ప్రవర్తించకుండా పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. -
అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
దేవాలయానికి ధ్వజస్తంభం ఎంతో కీలకం. వీలైనంత ఎత్తులో... ఇత్తడి తాపడంతో... చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా... దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్లరు. ఆలయ మూలవిరాట్టును దర్శించుకోరు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అయితే వీటి తయారీకి వినియోగించే కర్రకూ ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నారేప చెట్టును ఇందుకు వాడుకుంటారు. ఎత్తుగా పెరగడమే గాకుండా... బలంగా ఉండి... ఎన్నో ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బుట్టాయగూడెం: దేవాలయాల ముందు ఏర్పాటు చేసే ధ్వజస్తంభం నిర్మాణానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరమవుతుంది. ఇందుకోసం సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు మరికొన్ని రకాల వృక్ష జాతులను వినియోగిస్తారు. వీటిలో ఎక్కువగా సోమిచెట్టు, నారేప చెట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో ఈ కర్రలు అధికంగా లభిస్తాయి. అత్యధికంగా నారేప కర్రలతోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం.ఆకాశానికి నిచ్చెన వేసేలా ఈ చెట్లు పెరుగుతుంటాయి. ఈ వృక్షం ఎత్తు కనిష్టంగా 30 అడుగులు, గరిష్టంగా 50 అడుగులు ఉంటుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. గోదావరి నదీ పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచే వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల కోసం వీటిని తరలిస్తుంటారు. నారేప చెట్ల ప్రత్యేకత వృక్ష జాతుల్లో అన్నింటి కంటే నారేప వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసినా, ఎండకు ఎండినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది. వీటికి చెదలు కూడా పట్టవు. ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి, కొన్ని దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషమని పూర్వికులు చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు సోమి, నారేప, టేకు వృక్షాల కలప దొరకకపోవడం... కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ మార్చాల్సి రావడంతో పలుచోట్ల ఏక శిల రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి అడవిలో నుంచి వృక్షాలు తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలయం ఏ ప్రాంతంలో కడుతున్నారో, ధ్వజస్తంభానికి అవసరమైన కలప, తదితర వివరాలతో ఆధారాలను అధికారులకు చూపించాలి. బహిరంగ మార్కెట్లోని కలప విలువ ప్రకారం రుసుం చెల్లించాలి. ఇటీవల అటవీ సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనుమతులు అంత సులభంగా లభించడం లేదు. చెట్లు కూడా సులభంగా దొరికే అవకాశం లేదు. అందుకోసం పశ్చిమ మన్యంలోని అటవీశాఖ అధికారులు నర్సరీలో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పెంచాలనే ఉద్దేశంతో నర్సరీల ద్వారా పెంచుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నారేప ఎంతో బలమైంది వృక్ష జాతుల్లో ఎన్నో రకాలున్నా వాటన్నింటి కంటే నారేప చెట్టు బలంగా ఉంటుంది. దాని తర్వాత సోమిచెట్టు బలమైంది. నారేప చెట్టు కర్ర ఎండకు ఎండినా, వానకు తడిసినా పాడవ్వదు. చెదలు పట్టవు. ఈ కర్రతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం బలంగా ఉంటుంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా వీటినే వినియోగిస్తున్నారు. – ఎస్.బాలసుబ్రహ్మణ్యం, శివాలయం పూజారి, బుట్టాయగూడెం -
అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
నూతన సంవత్సరం రాకకు మరికొద్ది రోజులే మిగిలివున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి #WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq — ANI (@ANI) December 5, 2023 -
విరిగిన 15 స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు
మహబూబ్‌నగర్: రైతు పొలం నుంచి చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీకి విద్యుత్ స్తంభాల తీగలు తగిలి వరుసగా నాలుగు ట్రాన్స్ఫార్మర్లు దిమ్మెల పైనుంచి కింద పడి, స్తంభాలు విరిగిన సంఘటన మహమ్మదాబాద్ మండలంలో చోటుచేసకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అన్నారెడ్డిలో ఓ రైతు పొలంలో చెరుకు కోసుకుని లారీకి లోడ్ చేశారు. అటు నుంచి రోడ్డుపైకి వచ్చి వెళ్తున్న లారీకి పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. గమనించకుండా లారీని తోలడంతో 15 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు కిందపడిపోయాయి. దీంతో 20 మంది రైతుల వరకు బోరుమోటార్లు నడవకుండా నిలిచిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ లైన్ పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. -
భార్య గర్భిణిగా ఉందని చూడటానికి వచ్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
చిత్తూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలో జరిగింది. చిత్తూరు జిల్లాలో ని పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన శివశంకర్ కుమార్తె పల్లవిని బెంగళూరు నార్త్ వైట్‌ఫీల్డ్ గాంధీపుర మసీదు వీధికి చెందిన అంజనప్ప కుమారుడు బి.ఏ.యశ్వంత్‌కుమార్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. పల్లవి గర్భం దాల్చడంతో నెలరోజుల క్రితం పుట్టినిల్లు అయిన కృష్ణాపురానికి వచ్చింది. శనివారం యశ్వంత్‌కుమార్ భార్యను చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి కృష్ణాపురం వచ్చాడు. కొద్దిసేపు ఇంటి వద్ద గడిపిన అనంతరం రాత్రి 9.45 గంటలకు వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి కృష్ణాపురానికి వెళుతుండగా మదనపల్లె–బోయకొండ రోడ్డులోని వలసపల్లె సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన యశ్వంత్‌కుమార్‌కు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో పడి ఉన్న యశ్వంత్‌కుమార్‌ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఇద్దరు యువతులు మోడర్న్ డ్రస్ వేసుకుని బాలీవుడ్ సాంగ్‌కు మెట్రోలో పోల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 'మెయిన్ టూ బెఘర్ హున్' సాంగ్‌కు యువతులు లిప్ సింక్ చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ పాట సుహాగ్ చిత్రంలోని కాగా.. ప్రవీణ్ బాబీ, శశి కపూర్ నటించారు. ఈ పాటకు యువతులు పోల్ పట్టుకుని కింద నుంచి మీదకు లయబద్దంగా ఊగుతూ హోరెత్తించే స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సులు చూస్తే అలాగే ఉండిపోయారు తోటి ప్రయాణికులు. ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. After porn, kissing and fighting in Delhi Metro, The latest is Pole Dancing..... 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023 ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికుల తీరు మారట్లేదని వాపోతున్నారు. వైరల్ కావడానికి మెట్రో ఓ సాధనంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలా?. వీడియో వైరల్
ఒక దేశంలో నడి రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు పెట్టారు. ఏదో ఒకటి రెండో కాదు ఏకంగా చాలావరకు విద్యుత్ స్తంభాలన్ని రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఈ ఘటన పాకిస్తాన్లో ఒక జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని షామా జునేజో అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రహదారిపై కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలను చూస్తే ఏదో ప్రమాదవశాత్తు ఏర్పాటు చేసినట్లు లేదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలన్ని అలానే సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదీ కూడా శీతకాలంలో మరింత ప్రమాదకరమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ హయాంలో జరిగిందా అని వీడియోని పోస్ట్ చేసిన షామా జునేజో ప్రశ్నిస్తున్నారు. یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0 — Shama Junejo (@ShamaJunejo) October 4, 2022 (చదవండి: 11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!) -
వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్
స్పా ఫ్రాంకోర్ చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 59.765 సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.321 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన విలియమ్స్ డ్రైవర్ జార్జ్ రసెల్ రెండో స్థానంలో నిలవగా... మూడో స్థానంలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి -
Lightning Bolt: విద్యుత్ స్తంభంపై పిడుగుపాటు..
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): మండలంలోని ఎక్స్‌రోడ్డు లింగోజీ తండాలో విద్యుత్ స్తంభంపై బుధవారం పిడుగుపడింది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్తంభంపై పిడుగు పడడంతో ఎర్తింగ్ వైర్ తెగిందని సర్పంచ్ హరినాయక్ పేర్కొన్నారు. నెట్వర్క్ లేక ఏఎన్ఎంల పాట్లు నార్నూర్(గాదిగూడ): గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోపాటు, గర్భిణి, బాలింతల మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లకు ట్యాప్‌లు అందజేసింది. ప్రతిరోజు ఫీల్డ్ వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటోంది. మంగళవారం గాదిగూడ మండలంలో నెట్వర్క్ సౌకర్యం లేక ఏఎన్ఎంలు పడరాని పాట్లు పడ్డారు. ఝరి పీహెచ్సీ ఏఎన్ఎంలు గుట్ట ఎత్తు ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారి పవన్‌కుమార్.. ఆస్పత్రి భవనం ఎక్కి సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. చదవండి: Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త -
స్తంభం ఎక్కిన ఎలుగు, తనవారికోసం ఎదురుచూపులు!
వాషింగ్టన్: సాధారణంగా ఎలుగు బంట్లు అడవిలో ఉంటాయి. ఒక్కోసారి అడవిలో వాటికి ఆహారం దొరక్కగానీ లేదా దారి తప్పిగానీ మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయి. ఈక్రమంలో ఎలుగుబంట్లు మనుషులపైన దాడిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే, ఇక్కడ ఒక ఎలుగు బంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఒక విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని దక్షిణ అరిజోనా, విల్కాక్స్ పట్టణం కేంద్రంగా సల్ఫర్ స్పింగ్ వ్యాలీ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ అనే సంస్థ ఉంది. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ కార్మికులు ఒక ఎలుగు బంటి విద్యుత్ స్తంభం మీద ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఆ సంస్థ కార్మికులు వెంటనే ఆ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఒక పెద్ద క్రేన్‌ను తెప్పించారు. ఒక ఫైబర్ గ్లాస్ స్టిక్‌తో దాన్ని అదిలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగు బంటి మెల్లగా స్తంభం కిందకు దిగి, సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగుబంటి తన వారికోసం పైకెక్కి చూస్తుంది..’, ‘అయ్యో.. ఎంత పెద్ద ఆపద తప్పిపోయింది..’, ‘ హయ్.. మిత్రమా.. జాగ్రత్తగా దిగి నీ ఇంటికి వెళ్లిపో.. ’ ‘విద్యుత్ కార్మికుల చేసిన పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు “Alright, little bear. Time to get off this pole.” After being called to the scene, utility workers immediately cut the power and then helped coax this bear off a power pole in Arizona. The bear eventually climbed down safely and ran off into the desert. https://t.co/N3YkuSiGgg pic.twitter.com/FJSe51UEXD — ABC News (@ABC) June 10, 2021 -
నెల్లూరు జిల్లాలో పెను విషాదం
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరెంట్ వైర్ ఆ ఇంటి యమపాశంగా మారి ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. వివరాలు.. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఒక ఇంటి ప్రధాన గేటుపై 11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించకుండా గేటు తీసిన ఇంటి యజమాని టీచర్ వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే భర్తను రక్షిద్దామని ఏం ఆలోచించకుండా వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బజ్జమ్మ(70) వేణుగోపాల్ చేయి పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
విద్యుత్ తీగలపై విన్యాసాలు
-
అమ్మా ! మీ నిబద్ధతకు ఇవే మా జోహార్లు
డల్లాస్ : పోల్ డాన్స్.. అత్యంత కష్టమైన డాన్సుల్లో ఒకటి. ఇందులో డాన్స్‌తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా కలిపి ఉంటాయి. అందుకే ఇలాంటి డాన్స్ చేసే వాళ్లను ఎంతో గౌరవిస్తారు. ఒక పోల్ పట్టుకొని డాన్స్ చేస్తూ దానిపైనే విన్యాసాలు చేస్తూ.. ఆశ్చర్యపరిచే ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో, చాలా బ్యాలెన్సింగ్‌గా డాన్స్ మూమెంట్స్ చేస్తుంటారు. పొరపాటున డాన్స్ చేస్తున్నప్పుడు ఏ చిన్న తేడా జరిగినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎంతలా అంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని డల్లాస్‌లో చోటుచేసుకుంది. జెనియా స్కై అనే యువతి ఒక క్లబ్లో ప్రొఫెషనల్ స్ట్రిప్పర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే పోల్ డాన్స్ విన్యాసం చేస్తూ దాదాపు 15 అడుగుల ఎత్తున్న పోల్ నుంచి కింద పడ్డారు. దీంతో అక్కడున్న వారు ఆమెకు ఏమయిందోనని కంగారు పడ్డారు. కానీ ఆమె మాత్రం పైకి లేచి ఎప్పటిలాగే తన డాన్స్‌ను కంటిన్యూ చేయడంతో అక్కడున్నావారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఈ ప్రమాదంలో జెనియా స్కై దవడ, దంతాలు, కాలి మడమ విరిగాయి. అయితే ఓ అభిమాని ఇదంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత ప్రమాదంలోనూ తన వృత్తిని మరువని జెనియాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జెనియా స్పోర్టివ్ స్పిరిట్ చూసి ఆమె చాలా ధైర్యశాలి అని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. this sums up my first str*p club experience, i really do hope she’s ok 😭😭😭😭😭😭😭😭😭 pic.twitter.com/fA4Tu1mePL — x (@xvreae) February 9, 2020 అయితే తనపై అభిమానం చూపించిన నెటిజన్లకు జెనియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ' మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. నేను బాధలో ఉన్నప్పుడు నా వెనుక నిలిచినందుకు చాలా సంతోషంగా అనిపించింది. నా కదిలిన దవడను సరిచేయడానికి చిన్నపాటి సర్జరీ చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదురుకుంటుంది' అంటూ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. View this post on Instagram This isn’t for attention. This video is to update everyone and thank you guys for all the love and support. I’m truly blessed and I appreciate everyone’s kind messages. Thank you so much 🙏🏽💜 A post shared by @ genea_sky on Feb 9, 2020 at 4:08pm PST -
‘చావాలో.. బతకాలో మీరే తేల్చండి’
కౌలలాంపూర్ : ఇన్స్టాగ్రామ్ పోల్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఆమె ఫాలోవర్లు చేసిన సూచనలతో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సరవాక్‌కు చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోల్ కండక్ట్ చేసింది. దానిలో ‘ఇది నాకు చాలా ముఖ్యం. చావో, బతుకో తేల్చుకోవడంలో నాకు సాయం చేయండి’ అంటూ తన ఫాలోవర్లను కోరింది. ఏదో సరదాకు అనుకున్న నెటిజన్లు.. దాదాపు 69 శాతం మంది ఆమెను చనిపోమ్మని సూచించారు. దాంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై రామ్కర్పాల్ సింగ్ అనే ఎంపీ, లాయర్ స్పందిస్తూ.. ‘పోల్‌లో పాల్గొని చనిపోమని సూచించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు చనిపోమ్మని సలహా ఇచ్చింది వారే. తమ సమాధానం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వారు ఊహించలేకపోయారు. యువతి అనాలోచిత చర్యకు వీరు మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టం’ అన్నారు. -
విజేత నిర్ణయంలో..మహిళామణులు
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయపార్టీలు అధికారికంగా కాకపోయినా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశాయి. విజయనగరం నియోజకవర్గలో మహిళా ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో అతివలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కళలకు కాణాచిగా, విద్యలకు నిలయంగా, సాంస్కృతిక రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విజయనగరం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో మహిళలే నిర్ణయిస్తారు.నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ప్రభావం చూపుతుంటారు. జనాభా వివరాలు.. పట్టణ జనాభా 2,83,550 పురుషులు 1,39,900 మహిళలు 1,43,650 ఎస్సీ జనాభా పట్టణం 27,087 పురుషులు 13,193 మహిళలు 13,894 ఎస్టీ జనాభా పట్టణం 2773 పురుషులు 12220 మహిళలు 1553 మండలం.. మండల జనాభా 41,709 పురుషులు 21,190 మహిళలు 20,519 ఎస్సీ జనాభా మండలం 3351 పురుషులు 1718 మహిళలు 1633 ఎస్టీ జనాభా మండలం 726 పురుషులు 381 మహిళలు 345 విజయనగరం నియోజకవర్గంలో మొత్తంఓటర్లు.. ప్రాంతం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు విజయనగరం మున్సిపాలిటీ 219 88,553 91,785 25 విజయనగరం మండలం 41 15,116 15,241 2 మొత్తం 260 1,03,669 1,07,026 27 -
దొంగతనం చేశారనే అనుమానంతో..
లక్నో : దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు యువకులను ఎలక్ట్రిక్ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. అసిఫ్, ఇక్బాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం మూడు గంటల ప్రాంతంలో రాకేష్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో చొరబడి డబ్బు దొంగలించడానికి ప్రయత్నించరనే అనుమానంతో వారిని బంధించారు. అనంతరం ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టేసి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మీద దాడి చేసిన వారి మీద కేస్ ఫైల్ చేశారు. -
పోల్ డ్యాన్స్‌తో వెల్కం చెప్పిన ప్రిన్సిపాల్
బీజింగ్ : ‘చదువు నేర్పమని పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే మీరు ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తారా’ అంటూ తల్లిదండ్రులు చైనాలోని ఓ కిండర్ గార్టెన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై మండిపడుతున్నారు. ఇంత ఆగ్రహం తెప్పించే పని ఏం చేశాడా అంటే సదరు ప్రిన్సిపాల్ స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చిన పిల్లలకు పోల్ డ్యాన్స్‌తో ఆహ్వానం పలికాడు. దాంతో తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయునిపై మండి పడుతున్నారు. వివరాల ప్రకారం.. షెన్జెన్ పట్టణానికి చెందిన ఓ దంపతులు తమ పిల్లాడిని కిండర్ గార్టెన్ స్కూల్లో జాయిన్ చేయాలని భావించారు. దాంతో తమకు సమీపంలో ఉన్న ఓ కిండర్ గార్టెన్ స్కూల్లో చేర్పించేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వీరితో పాటు మరి కొందరు పిల్లలు కూడా కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు. కొత్తగా వచ్చిన పిల్లలను ఘనంగా ఆహ్వానించడానికి సదరు స్కూల్ ప్రిన్సిపాల్ మహిళా డ్యాన్సర్‌తో పోల్ డ్యాన్స్ ఏర్పాటు చేశాడు. ఇది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోవడమే కాక ‘విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి పనికి మాలిన వేషాలు వేస్తావా’ అంటూ చివాట్లు పెట్టారు. దాంతో సదరు ప్రిన్సిపాల్ తన తప్పును క్షమించమంటూ పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ పోల్ డ్యాన్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరలవుతున్నాయి. -
నటి యామి గౌతమ్ పోల్ డాన్స్
-
వైరలవుతున్న నటి పోల్ డాన్స్ వీడియో
యామి గౌతమ్ సోషల్ మీడియాకు కామెంట్ల ప్రవాహం పెరిగిపోయిందంట. అభిమానులైతే యామిని పొగడ్తలతో ముంచేతుత్తున్నారంట. ఇంతకూ ఈ భామ చేసిన అంత గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా. మరేం లేదు.. ఈ కాబిల్ భామ జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోనొకదాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. యామికున్న ఫిట్నెస్ పిచ్చి అభిమానులందరికి తెలిసిందే. ఫిట్నెస్ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పోల్ డాన్స్‌ను నేర్చుకుంటుంది. యామి ఈ ఏడాది మార్చి నుంచి పోల్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. కాకపోతే మధ్యలో కాస్తా బిజీ షెడ్యూల్ వల్ల కొంత కాలం పోల్ డాన్స్ ప్రాక్టీస్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రెండో దశ పోల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారెవ్వరు యామి పోల్ డాన్స్ చేయడం ఇదే మొదటిసారి అంటే నమ్మలేరు. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్, అనుభవమున్న వారికి ధీటుగా ఈ భామ పోల్ డాన్స్‌లో విజృభించింది. ఈ వీడియో చూసిన అభిమానులు యామిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేనా గతంలో యామి చేసిన ఎలియన్ డాన్స్ వీడియో కంటే అధికంగా ఇప్పుడు ఈ పోల్ డాన్స్ వీడియో వైరలవుతుంది. యామి పోల్ డాన్స్‌ను ఫిట్నెస్ ఆప్షన్‌గా ఎంచుకోవాడానికి గల కారణాల గురించి చెబుతూ ‘డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జిమ్‌తో పాటు పోల్ డాన్స్‌ను కూడా నా ఎక్సర్సైజ్లో చేర్చుకున్నాను. దీని వల్ల బయట నుంచే కాక లోపలి నుంచి కూడా బలంగా తయారవుతాను. మా అమ్మ ఎప్పడు ఒక మాట చెబుతూ ఉంటుంది. అందంగా ఉండటం అంటే కడుపు మాడ్చుకోవడం, అరాకొరగా తినడం కాదు. అందం అంటే ఆరోగ్యంగా ఉండటం. కాబట్టి ఎప్పుడు నీ భోజనాన్ని మాత్రం వదులుకోకు అని చెబుతుంటుంది’ అన్నారు. -
భూమి ధ్రువాలు ఉల్టా పల్టా..!
ఎక్కడో అంటార్కిటికాలోని పక్షులు... ఉత్తరాన సైబీరియాకు వలస వెళుతూంటాయి. ఎలా? వాటిల్లో భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే కంపాస్ లాంటిది ఉంటుంది కాబట్టి! మరి.. ఈ అయస్కాంత క్షేత్ర ధ్రువాలు తిరగబడితే? అలా ఎందుకు అవుతుందనుకోవద్దు. త్వరలోనే ఇది జరగబోతోంది. కొంచెం గందరగోళంగా అనిపిస్తోందా...? వివరంగా అర్థం చేసుకుందాం. భూగర్భంలో కుతకుత ఉడికే ఇనుము ఉంటుంది. ఇది అటు ఇటు ప్రవహించే క్రమంలో భూమి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి కాబట్టే.. మన కంపాస్లలో చూపే ఉత్తరం.. అయస్కాంత క్షేత్రం తాలూకు దక్షిణ ధ్రువమై ఉంటుంది. త్వరలో ఉత్తరం.. దక్షిణంగా మారనుంది. అలాగే దక్షిణ ధ్రువం కాస్తా ఉత్తరంగా మారనుంది. ఇంకోలా చెప్పాలంటే ఆర్కిటిక్ ప్రాంతం అయస్కాంతక్షేత్ర దక్షిణ ధ్రువంగా మారితే.. అంటార్కిటికా కాస్తా ఉత్తర ధ్రువ ప్రాంతంగా మారుతుందన్నమాట. గత శతాబ్ద కాలంలో అయస్కాంత ధ్రువం ఏటా దాదాపు 64 కిలోమీటర్ల చొప్పున స్థానభ్రంశం చెందుతూ వస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే దీనివల్ల మనకేమీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే దాదాపు రెండు మూడు లక్షల ఏళ్ల క్రితం కూడా ధ్రువాలు తారుమారైనప్పుడు ఎలాంటి విపత్తూ జరగలేదని శిలాజాల ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే మెదడులోనే కంపాస్లు కలిగి ఉండే వలస పక్షులపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పిలిస్తే పలికే అలెక్సా చేతుల్లోకి వచ్చేస్తోంది.. అమెజాన్ అలెక్సా గురించి మీరు వినే ఉంటారు. కృత్రిమ మేధ సాయంతో నిర్మాణమైన ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మీరు ఏ ప్రశ్న అడిగినా ఠకీమని సమాధానమిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. త్వరలోనే ఇది వాచీల్లోకి ఇమిడిపోనుంది కాబట్టి! ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉండే అలెక్సా – ఎకో చిన్న డబ్బా సైజులో ఉంది. దీన్ని ఇంట్లో ఉంచుకుని.. తగిన నెట్వర్కింగ్ చేసుకుంటే.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ దీని సాయంతోనే నియంత్రించవచ్చు. ‘‘అలెక్సా.. ఏసీ ఆఫ్ చేసేయ్’’ అంటే వెంటనే కట్టేస్తుందన్నమాట. ఇంతటి శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరలో లాస్‌వెగాస్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారని సమాచారం. ఇప్పటికే అందుబాటులో ఉన్న అలెక్సా మొబైల్ యాక్సెసరీ కిట్ సాయంతో డెవలపర్లు దాదాపు అన్ని రకాల వేరబుల్స్ (ధరించగలిగేవి)లోకి అలెక్సాను జొప్పించవచ్చునని అమెజాన్ అంటోంది. ఆడియో పరికరాల తయారీ సంస్థ బోస్ అలెక్సా సాయంతో అత్యాధునిక ఇయర్ఫోన్లను తయారుచేసేందుకు రెడీ అవుతూంటే మొబైల్ ద్వారా కూడా అలెక్సా సేవలు అందించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ యాక్సెసరీ కిట్‌ను అందుబాటులోకి తేవడం వల్ల హార్డ్‌వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కోడింగ్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అమెజాన్ ప్రతినిధి గగన్ లూథ్రా తెలిపారు. కళ్లలోకి చూస్తే... జబ్బులేమిటో తెలుస్తాయా? కళ్లు మన మనసులోని భావాలను ప్రదర్శించేందుకు కొద్దోగొప్పో ఉపయోగపడతాయిగానీ.. బబ్బుల వివరాలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా డీప్ లెర్నింగ్ టెక్నాలజీ మహిమ. విషయం ఏమిటంటే.. గూగుల్‌కు చెందిన పరిశోధన విభాగం కేవలం కళ్లలోని భాగాల తాలూకూ ఫొటోల (ఫండూస్ ఇమేజెస్ అని పేరు) ద్వారా వారి వయసుతోపాటు రక్తంలోని చక్కెర శాతం (హెచ్మీఏ1సీ), రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వంటి వివరాలన్నింటినీ సేకరించవచ్చునని ప్రకటించారు. ఇందుకోసం గూగుల్ రీసెర్చ్ విభాగపు శాస్త్రవేత్తలతోపాటు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపు 2.8 లక్షల మంది కనుగుడ్డు తాలూకు చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించారు. టెన్సర్‌ఫ్లో అనే కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ సాయంతో జరిపిన ఈ పరిశీలన ద్వారా చెప్పుకోదగ్గ కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ నీల్సన్ తెలిపారు. డీప్ లెర్నింగ్, మెషీన్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాఫ్ట్వేర్లు కనుగుడ్లను మాత్రమే కాదు... అతిసూక్ష్మమైన కణాల ఛాయాచిత్రాలతోనూ మనుపు ఎన్నడూ సాధ్యం కాని పనులు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తాము ఉపయోగించిన సమాచారం చాలా చిన్నదని, మరింత ఎక్కువ సంఖ్యలో చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ పద్ధతులకు పదును పెట్టవచ్చునని వివరించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
- గొడిగెనూరు గ్రామంలో ఘటన –మృతికి విద్యుత్‌శాఖ అధికారులే కారణమని బంధువుల ఆరోపణ గొడిగెనూరు(చాగలమర్రి): చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు ట్రాన్స్‌కో అధికారుల తీరే కారణమని గ్రామస్తులు, మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (30) విద్యుత్ లైన్మెన్ సుధాకర్, ఏఎల్ఎం నాగశేషులతో గ్రామంలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి వెలుతుండే వాడు. లైన్మెన్ సెలవు పెట్టడంతో ఏఎల్ఎం ఆదివారం గొడిగెనూరు 11కేవీ రిపేరీ కోసం సుబ్రమణ్యంను స్తంభం ఎక్కించారు. అయితే, మరమ్మతు చేస్తున్న విద్యుత్ స్తంభం పక్కనే 765 పవర్‌గ్రిడ్ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఈ విద్యుత్ తీగల ఇండెక్షన్ సుబ్రమణ్యంకు తగలడంతో షార్ట్‌సర్య్యూట్ అయి స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇంజినీర్ షాజహాన్, విద్యుత్ సిబ్బంది రామకృష్ణారెడ్డి లతో వాగా్వదానికి దిగారు. ఏమి తెలియని సుబ్రమణ్యంను ఏఎల్ఎం నాగశేషు విద్యుత్ స్తంభాన్ని ఎక్కించి నిండు ప్రాణం తీశాడని ఆరోపించారు. ఈ దుఃఖంలో మృతుడి బంధువులు విద్యుత్‌సిబ్బందిని పట్టుకొని చితకబాదారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటా్టరు. -
స్తంభం విరిగినా.. పట్టించుకోరా..!
మర్రిగూడ : మండల కేంద్రంలోని గంథ్రాలయ వద్ద నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం మధ్యకు విరిగి ఇనుప చువ్వల ఆధారంగా వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఈ స్తంభం నుంచివెళ్లే లైన్‌తోనే గృహాలకు విద్యుత్ సరఫరా అవుతున్నా సంబంధిత అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ స్తంభంతో పెను ముప్పు పొంచి ఉన్నందున వెంటనే దాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యుత్ స్తంభం మీదపడి యువకుడి మృతి
మేళ్లచెర్వు: విద్యుత్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం మండలంలోని కందిబండ గ్రామపంచాయతీ పరిధిలో గల నల్లబండ గూడెం గ్రామం వద్ద విద్యుత్ లైన్ లాగే క్రమంలో గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన దినసరి కూలీలు స్తంభాలు నిలబెట్టుతుండగా కరెంటు తీగలు స్తంభానికి తగిలి షాక్ వచ్చింది. దీంతో స్తంభాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టడంతో మీదపడి కుంభం అనిల్(20) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.