పోల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న నటి యామి గౌతమ్
యామి గౌతమ్ సోషల్ మీడియాకు కామెంట్ల ప్రవాహం పెరిగిపోయిందంట. అభిమానులైతే యామిని పొగడ్తలతో ముంచేతుత్తున్నారంట. ఇంతకూ ఈ భామ చేసిన అంత గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా. మరేం లేదు.. ఈ కాబిల్ భామ జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోనొకదాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. యామికున్న ఫిట్‌నెస్ పిచ్చి అభిమానులందరికి తెలిసిందే. ఫిట్‌నెస్ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పోల్ డాన్స్‌ను నేర్చుకుంటుంది.
యామి ఈ ఏడాది మార్చి నుంచి పోల్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. కాకపోతే మధ్యలో కాస్తా బిజీ షెడ్యూల్ వల్ల కొంత కాలం పోల్ డాన్స్ ప్రాక్టీస్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రెండో దశ పోల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారెవ్వరు యామి పోల్ డాన్స్ చేయడం ఇదే మొదటిసారి అంటే నమ్మలేరు. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్, అనుభవమున్న వారికి ధీటుగా ఈ భామ పోల్ డాన్స్‌లో విజృభించింది. ఈ వీడియో చూసిన అభిమానులు యామిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేనా గతంలో యామి చేసిన ఎలియన్ డాన్స్ వీడియో కంటే అధికంగా ఇప్పుడు ఈ పోల్ డాన్స్ వీడియో వైరలవుతుంది.
యామి పోల్ డాన్స్‌ను ఫిట్‌నెస్ ఆప్షన్‌గా ఎంచుకోవాడానికి గల కారణాల గురించి చెబుతూ ‘డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జిమ్‌తో పాటు పోల్ డాన్స్‌ను కూడా నా ఎక్సర్‌సైజ్‌లో చేర్చుకున్నాను. దీని వల్ల బయట నుంచే కాక లోపలి నుంచి కూడా బలంగా తయారవుతాను. మా అమ్మ ఎప్పడు ఒక మాట చెబుతూ ఉంటుంది. అందంగా ఉండటం అంటే కడుపు మాడ్చుకోవడం, అరాకొరగా తినడం కాదు. అందం అంటే ఆరోగ్యంగా ఉండటం. కాబట్టి ఎప్పుడు నీ భోజనాన్ని మాత్రం వదులుకోకు అని చెబుతుంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment