సింగపూర్ గ్రాండ్‌ప్రి
సింగపూర్: ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ లొండా నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. నోరిస్ 1 గంట 29 నిమిషాల 525 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకోగా... రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (1 గంట 29 నిమిషాల 728 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు.
తొలి రెండు స్థానాల్లో నిలిచిన డ్రైవర్ల మధ్య కేవలం 0.203 సెకన్ల తేడా మాత్రమే ఉంది. బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 841 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 867 సెకన్లు), ఆస్కార్ పీస్ట్రి (మెక్‌లారెన్; 1 గంట 29 నిమిషాల 953 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు.
24 రేసుల సీజన్‌లో సింగపూర్ గ్రాండ్ ప్రి 18వ రేసు కాగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం నెదర్లాండ్స్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత కొన్ని రేసులుగా నిలకడ కొనసాగిస్తున్న నోరిస్ 254 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 59 పాయింట్ల అంతరం ఉంది. మరో ఏడు రేసులు మిగిలుండగా... ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్íÙప్ ట్రోఫీ కైవసం చేసుకునే దిశగా ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్ ప్రి కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment