position
-
నోరిస్‌కు పోల్ పొజిషన్
సింగపూర్: ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లొండా నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. నోరిస్ 1 గంట 29 నిమిషాల 525 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకోగా... రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 గంట 29 నిమిషాల 728 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన డ్రైవర్ల మధ్య కేవలం 0.203 సెకన్ల తేడా మాత్రమే ఉంది. బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 841 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్; 1 గంట 29 నిమిషాల 867 సెకన్లు), ఆస్కార్ పీస్ట్రి (మెక్లారెన్; 1 గంట 29 నిమిషాల 953 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. 24 రేసుల సీజన్లో సింగపూర్ గ్రాండ్ ప్రి 18వ రేసు కాగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం నెదర్లాండ్స్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత కొన్ని రేసులుగా నిలకడ కొనసాగిస్తున్న నోరిస్ 254 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 59 పాయింట్ల అంతరం ఉంది. మరో ఏడు రేసులు మిగిలుండగా... ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్íÙప్ ట్రోఫీ కైవసం చేసుకునే దిశగా ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్ ప్రి కీలకం కానుంది. -
ఆక్స్ఫర్డ్ చాన్సలర్ పదవికి ఇమ్రాన్ పోటీ!
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి పోటీపడనున్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఆన్లైన్ బ్యాలట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు సలహాదారుడైన వ్యాపారవేత్త సయ్యద్ జుల్ఫీ బుఖారీ శుక్రవారం జియో న్యూస్‌కు తెలిపారు. ఇమ్రాన్ ఆక్స్‌ఫర్ యూనివర్శిటీ పూర్వ విద్యారి్థ. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. 2005–2014 దాకా ఆయన బ్రాడ్ఫోర్డ్ యూనివర్శిటీ చాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి గౌరవ హోదా.. పూర్వ విద్యార్థులు దీని కోసం పోటీపడటానికి అర్హులు. రాజకీయ నాయకులకు ఈ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. -
RC Bhargava: భవిష్యత్ భారత్‌దే
న్యూఢిల్లీ: భవిష్యత్ వృద్ధికి సంబంధించి మిగతా దేశాలన్నింటితో పోలిస్తే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. భారత్ ముందుకు సాగాలంటే కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు, విధానాలను వదిలించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు.. వృద్ధి సాధన గురించి ఇథమిత్థంగా అంచనా వేయలేని నిర్దిష్ట స్థాయికి చేరాయని భార్గవ చెప్పారు. అక్కడి ప్రజలు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నప్పటికీ పని చేయాలన్న స్ఫూర్తి తగ్గిందని ఆయన తెలిపారు. మరోవైపు, మన వారు తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును కూడా గణనీయంగా మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. ఇదే కసి భారత్‌ను ముందుకు తీసుకెడుతోందని ఆయన వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ మనం కాలం చెల్లిన విధానాలన్నింటినీ వదిలించుకోవాల్సి ఉందన్నారు. ఇక, తమ సంస్థ ముందు నుంచి పొదుపుగా వ్యవహరిస్తూ వస్తోందని, అందుకే వ్యాపార విస్తరణ కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అంతర్గత నిధులనే వినియోగించుకుంటున్నామని భార్గవ చెప్పారు. చిన్న పట్టణాల్లో నెక్సా సరీ్వస్ మారుతీ సుజుకీ చిన్న పట్టణాల్లో సరీ్వస్ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంపాక్ట్ నెక్సా సరీ్వస్ వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్సహా హర్యానా, పశి్చమ బెంగాల్, గుజరాత్, తమిళనాడులో మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2025 మార్చి నాటి కి దేశవ్యాప్తంగా ఇటువంటి 100 వర్క్‌షాప్స్‌ను నెలకొల్పాలన్నది లక్ష్యమని మారుతీ సుజుకీ ఇండి యా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా జరుగుతున్న మొత్తం కార్ల విక్రయాల్లో నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల వాటా 30 శాతం ఉందని చెప్పారు. -
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి సునీత రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పదవికి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్ఎస్ పార్టీ బీఫారం కూడా అందు కున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆమె రాజీనా మాను ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్స న్గా సునీతా లక్ష్మారెడ్డి 27 డిసెంబర్ 2020న నియమితులయ్యారు. ఆమె పదవీ కాలానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆమె రాజీనామా చేయడం అనివార్యమైంది. -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్‌పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్‌గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్‌ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్!
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్! -
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్
హిడెన్ బర్గ్ నివేదికతో మూడు నుంచి ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్ -
భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ గా అభయ్ శర్మ నియమితమయ్యే అవకాశం
-
కృష్ణా జిల్లా టీడీపీలో పదవుల ఫైటింగ్
-
ముప్పుటేరు
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ప్రధాన డ్రెయిన్ ఉప్పుటేరు సిల్టు, కిక్కిసతో పూడుకుపోతుంది. దీంతో వరదల సమయంలో డ్రెయిన్ పరివాహక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఉప్పుటేరు కొల్లేరు నుంచి ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెంలో సముద్రంలో కలుస్తుంది. దీనిని ఆనుకుని సుమారు 80 వేల ఎకరాల్లో వరి, ఆక్వా సాగుచేస్తున్నారు. ఉప్పుటేరు అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ఏటా వర్షాకాలంలో డ్రెయిన్ పొంగి పొర్లుతుంది. దీనికితోడు సముద్రపు ఆటుపోటులకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉప్పుటేరు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీరు కొరత తీరుతుందని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పుటేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయ సమీపంలో కొల్లేటికోట జీరో మైలు రాయి వద్ద ప్రారంభమై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా సముద్రంలో కలుస్తుంది. సముద్రపు ఆటుపోటులను ఎదుర్కొంటూ ఎగువ ప్రాంతాల్లో ముంపునీటిని సముద్రంలోకి తరలిస్తుంది. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, చేపల చెరువులు, లోతట్టు ప్రాంతాలను ఉప్పుటేరు కాపాడుతుంది. అయితే ఉప్పుటేరుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో చాలా చోట్ల మూడు మీటర్లు పైగా లోతు ఉండాల్సిన డ్రెయిన్ మీటరు లోతుకు పూడుకుపోయింది. పూడికతీతను మరిచారు సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉప్పుటేరు పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తట్ట మట్టికూడా తీయకపోవడంతో ఉప్పుటేరు పూడుకుపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేలాది ఎకరాలు నీటమునగడంతోపాటు పరివాహక ప్రాంత గ్రామాలన్నీ ఉప్పుకయ్యలుగా మారే ప్రమాదం ఉందని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సముద్ర ముఖద్వారం నుంచి ఉప్పుటేరు ఎగువ ప్రాంతం వరకు డ్రెజ్జింగ్ చేసి పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముంపు తప్పట్లేదు అధిక వర్షాలు, తుపానుల సమయంలో ఉప్పుటేరు ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లన్నీ పొంగిపొర్లుతూ ఉప్పుటేరులో కలుస్తున్నాయి. దీంతో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు కదులుతుంది. ఇదే సమయంలో సముద్రపు ఆటుపోటుల కారణంగా సముద్రం నీరు ఉప్పుటేరులోకి ఎగదన్నడం వల్ల వర్షం నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. డ్రెయిన్లన్నీ ఉప్పుటేరులోకే.. జిల్లాలోని అన్ని ప్రధాన డ్రైయిన్లు దక్షిణం వైపున ఉన్న ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. కొల్లేరుతోపాటు ప్రధాన డ్రెయిన్లయిన మొగదిండి, కొత్త యనమదుర్రు, బొండాడ, పొలిమేరతిప్ప, పాత యనమదుర్రు, సాల్ట్క్రీక్ డ్రెయిన్లు ఉప్పుటేరులో కలుస్తున్నాయి. పలు చిన్న, మధ్య తరహా డ్రెయిన్లు ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. స్లూయిజ్ నిర్మిస్తే లాభం ఉప్పుటేరు డ్రెయిన్‌కు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే పంటలు సస్యశ్యామలం అవుతాయని రైతులు అంటున్నారు. ఏటా జనవరి నుంచి జూన్ నెల వరకు సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరు వరకు ఎగదన్నడంతో ఈ ప్రాంతం ఉప్పుకయ్యలుగా మారుతోంది. స్లూయిజ్ నిర్మాణంతోనే దీనిని అడ్డుకోవచ్చని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం భీమవరం డివిజన్లో ఉప్పుటేరు 33 మైళ్లు వరకు వ్యాపించి ఉంది. దీని పూడికతీత పనులకు సంబంధించి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ఉప్పుటేరు అభివృద్ధికి కృషిచేస్తాం. – సుజాత, డ్రెయిన్స డీఈ -
వైఎస్ఆర్సీపీలో పలువురికి స్థానం
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పదవులను కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిని స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా, పి.ఆర్.వెంకటేశ్వరరెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, వంగాల పరమేశ్వరరెడ్డిని స్టేట్ అఫిలియేటెడ్ వింగ్ కమిటీలో యూత్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమించారు. జిల్లా కమిటీలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వి.రామ్మోహన్‌రెడ్డి జిల్లా కార్యదర్శిగా, బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన డి.రామసుబ్బారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, వెంకటశివారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులయ్యారు. కర్నూలు సిటీ అఫిలియేటెడ్ వింగ్ ప్రెసిడెంట్స్‌లో కర్నూలు నియోజకవర్గానికి చెందిన పెయ్యల కిషోర్‌ను కర్నూలు సిటీ ఆటోరిక్షా వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్ఆర్టీయూసీ), ఎస్.వహీదాను కర్నూలు సిటీ బీడీ వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్ఆర్టీయూసీ) నియమించారు. -
వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో దిగువకు భారత్
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ తగ్గింది. ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్-2016 వార్షిక నివేదిక ప్రకారం.. ఇండియా పది స్థానాలు కోల్పోయి 112వ స్థానంలో నిలిచింది. న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కు, అంతర్జాతీయ వ్యాపారం, నియంత్రణలు, ప్రభుత్వపు పరిమాణం వంటి పలు అంశాల్లో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచిందని నివేదిక పేర్కొంటోంది. దీంతో ర్యాంక్ కిందకు పడింది. కాగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ వెనక వరుసలో నిలిచాయి. ఇవి వరుసగా 113వ స్థానాన్ని, 121వ స్థానాన్ని, 133వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక భూటాన్ (78వ స్థానం), నేపాల్ (108వ స్థానం), శ్రీలంక (111వ స్థానం) దేశాలు మన కన్నా ముందు వరుసలో నిలిచాయి. టాప్‌లో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, కెనడా, జార్జియా, ఐర్లాండ్, మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు ఉన్నాయి. చివర్లో ఇరాన్, అల్జీరియా, అర్జెం టినా, గినియా వంటి దేశాలు నిలిచాయి. -
ఆవరణ చెరువు.. రక్షణ కరువు..
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాల వద్ద సురక్షిత పరిస్థితులు కొరవడుతున్నాయి. జిల్లాలో ఓ అంగన్వాడీ కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై ఓ చిన్నారికి నూరేళ్లూ నిండిన విషాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ దుర్ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోలేదనడానికి.. కాకినాడ రూరల్ మండలంలోని వలసపాకల అంగన్వాడీ కేంద్రమే నిదర్శనం. డ్రెయిన్ల నుంచి వచ్చే మురుగుతో పాటు కొంచెం వానపడ్డా ఆ కేంద్రం చుట్టూ నీటిమడుగు తయారవుతోంది. అందులోంచే తల్లులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారులు ప్రమాదానికి గురయ్యే ముప్పు పొంచి ఉంది. ఎలాంటి దుర్ఘటనా జరగకముందే అధికారులు కన్ను తెరవాలి. కేంద్రం ఆవరణను మెరక చేయడంతో పాటు ప్రహారీ నిర్మించి, దారిని ఏర్పాటు చేయాలి. – కాకినాడ రూరల్ -
ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫోసిస్
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి. ఇక ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, భారత్ ఫోర్జ్, అలెంబిక్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి తదితర 14 కంపెనీలు కొత్తగా స్థానం దక్కించుకున్నాయి. అమ్మకాల వృద్ధి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల వంటి తదితర అంశాల ప్రాతిపదికన పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యంతో జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ వివరించింది. -
టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ
జలంధర్: ప్రముఖ మ్యాగ జైన్ ‘ఇండియా టుడే’ ఇటీవల రూపొందించిన దేశంలోని టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్ జాబితాలో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ’ (ఎల్పీయూ) స్థానం పొందింది. ఎంట్రప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్‌కు ఎల్పీయూ ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిస్తుందని, అందుకే తమకు ఈ గౌవరం లభించిందని ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎల్పీయూ పేరు సుపరిచితమని.. ఇక్కడ సోలార్ కారు, క్వాడ్-కాప్టర్స్, డ్రైవర్‌లెస్ కారు వంటి తదితర ఆవిష్కరణలు జరిగాయని ఇండియా టుడే స్టాఫ్ కరస్పాండెంట్ కరిష్మా గోయెంకా పేర్కొన్నారు. -
ఆసియాలో ఉద్యోగానికి ఉత్తమమైన 25 పెద్ద కంపెనీల్లో 10 మనవే
న్యూఢిల్లీ: ఆసియా ప్రాంతంలో ఉద్యోగానికి ఉత్తమమైన 25 పెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి 10 కంపెనీలు స్థానం పొందాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతపు ఉద్యోగానికి ఉత్తమ కంపెనీల జాబితా ప్రకారం.. ఆసియాలో ఉద్యోగానికి అనువైన ఉత్తమ బహుళజాతి కంపెనీల కార్యాలయాల విభాగంలో డీహెచ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. దీని త ర్వాతి స్థానంలో ఓమ్నికామ్, గూగుల్, ఈఎంసీ, మారియట్, నెట్‌యాప్, హయత్, మార్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, శాప్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 8 కంపెనీల కార్యాలయాలు భారత్‌లోనివే. భారత్ కంపెనీల్లో,,, గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, లుపిన్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ మార్షల్, లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్, సిల్వర్ స్పార్క్ అప్పరెల్, ఉజ్జివన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎం అండ్ ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి. -
వెన్నుదన్ను
మానవదేహంలో అత్యంత ప్రధాన అవయవం వెన్నెముక. మనిషిని బలంగా నిలబెట్టేది, బలహీనుడ్ని చేసిపడగొట్టేది ఇదే. అందుకే దీనిని ఎంత బలంగా ఉంచితే మనిషి అంత ఆరోగ్యవంతంగా ఉంటాడు. యోగాలో పలు ఆసనాలు వెన్నెముక సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపకరిస్తాయి. అందులో కొన్ని... వీరభద్రాసనం 1 సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచేతిని ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకువెళ్లి, శ్వాస వదులుతూ కుడిచేతిని ఎడమకాలును సమాంతరంగా ఉంచి ముందుకు వంగాలి. నేలకు సమాంతరంగా వంగినపుడు కుడిచెయ్యి ఎడమకాలు స్ట్రెయిట్ లైన్లో ఉండటం గమనించవచ్చు. ఎడమచేతిని నడుము పక్కనే నిటారుగా ఉంచాలి. చేతివేళ్లు కూడా స్ట్రెచింగ్ పొజిషన్లో ఉండటం గమనించగలరు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ కుడిచేతిని పైకి ఎడమకాలును క్రిందకు, శ్వాస వదులుతూ కుడిచేతిని భూమివైపు చూపిస్తూ, కుడిపక్క నుండి క్రిందకు నడుము పక్కకి తీసుకురావాలి. మళ్లీ సమస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. వీర భద్రాసనం 2 సమస్థితిలో నిలబడి రెండు చేతులూ స్ట్రెచ్ చేస్తూ అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ పైకి తీసుకువెళ్లి పైన లింగముద్రలో (చేతులు రెండు ఇంటర్‌లాక్ చేసిన తరువాత ఎడమచేతి బొటనవేలును పైకి నిలబెట్టి ఉంచాలి) లేదా నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును కొంచెం వెనుకకు తీసుకొని పొజిషన్ తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ కలిపి ముందుకి స్ట్రెచ్ చేస్తూ వంగాలి. వెనుక కాలును పైకి లేపాలి. చేతులు, వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసల తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపాలి. చేతులు వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసలు తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి ఎడమకాలు వెనుకకు, కిందకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతులు రెండూ భూమివైపుకి చూపిస్తూ నడముకు ఇరువైపులా కిందకు తీసుకురావాలి. ఇలా చేయలేని వారు ముందు వైపు కుర్చీ, డైనింగ్ టేబుల్గాని రెండడుగుల దూరంలో ఉంచి ముందుకు వంగినపుడు చేతులతో వాటికి సపోర్ట్ పెట్టి వెనుక కాలును వీలైనంత పైకి నిటారుగా లేపవచ్చు. అనుభవమున్న సాధకులు కూడా కుర్చీ సపోర్ట్ తీసుకుంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. గరుడాసన ఆకాశంలో ఎగురుతూ నీటిలో ఉన్న ఆహారాన్ని పసిగట్టి గంటకు 200 మైళ్ల వేగంతో కిందకు దూసుకువచ్చి గురి తప్పకుండా ఆహారాన్ని నోట కరచుకోగల సామర్థ్యం గరుడపక్షి సొంతం. అత్యంత ఏకాగ్రత ఇందులో ఇమిడి ఉంది. అందుకే గరుడ అంటే శక్తికి, ఏకాగ్రతకు చిహ్నం. చేసే విధానం: ఎడమ మోకాలు కొంచెం ముందుకు వంచి ఎడమకాలు మీద నిలబడి కుడికాలును పై నుంచి ఎడమకాలు చుట్టూ ట్విస్ట్ చేయాలి. ఎడమచేతిని ముఖానికి ఎదురుగా నిలువుగా ఉంచి కుడిచేతిని ఎడమ చేతి చుట్టూ ట్విస్ట్ చేస్తూ రెండు అరచేతులనూ దగ్గరగా నమస్కారముద్రలోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ కలిపి ఉంచిన రెండు చేతులను నమస్కార ముద్రలోనే పైకి తీసుకెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత క్రమంగా చేతుల్ని ఆ తరువాత కాళ్లను అన్‌లాక్ చేస్తూ సమస్థితికి రావాలి. అదే విధంగా రెండోవైపునకు కూడా చేయాలి. ఉపయోగాలు: వీపు పైభాగాలైన షోల్డర్ బ్లేడ్స్‌కి, ట్రెఫీజియస్ కండరాలకు, కాళ్లలో ఉన్న కండరాలు బలంగా తయారవడానికి బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసికంగా కూడా బలంగా తయారవుతారు. సాధారణ త్రికోణాసన కాళ్ల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం ఉంచాలి. ఎడమ పాదం పక్కకు, కుడిపాదం ముందుకు ఎడమపాదానికి సమాంతరంగా రెండు చేతులూ 180 డిగ్రీలలో సమాంతర రేఖలో భూమికి సమాంతరంగా ఉంచి శ్వాస తీసుకుంటూ నడుమును పూర్తిగా పక్కకు తిప్పాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు కుడి పాదం పక్కనే నేల మీదకు (నేల మీద పెట్టలేకపోతే కుడిపాదాన్ని కాని చీలమండను కాని లేదా మోకాలి కిందిభాగాన్ని కాని పట్టుకోవచ్చు) ఎడమ చేయి పైకి కుడిచేతికి సమాంతరంగా చాతీని నేలవైపు ముందుకు వంగిపోకుండా వీలైనంత పక్కకు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి, చేతులు భూమికి సమాంతరంగా తీసుకువచ్చి శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకు తీసుకురావాలి. రెండోవైపు కూడా ఇదే విధంగా చేయాలి. ఉపయోగాలు: శ్వాసకోస మరియు రక్తప్రసరణ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. వెన్నుపూసల అలైన్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. ఉపయోగాలు: వెన్నెముకను, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. లోయర్ బ్యాక్ సమస్యకు పరిష్కారం. గుండె, ఊపిరితిత్తుల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. -
పేరుకే మంత్రి.. పాపం మాట వినేవారులేరు
-
కాల్‌మనీ కేసుతో సంబందం లేదు
-
జీపీఎస్ కు బదులుగా ఇస్రో సొంత సిగ్నల్ వ్యవస్థ
జీపీఎస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల ప్రాంతాన్ని చేరాలన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్ అందుబాటులో ఉంటే చాలు... వెళ్లాల్సిన ప్రాంతాన్ని యాప్ లో ఎంటర్ చేశారంటే... మ్యాపింగ్ ద్వారా మీరు చేరాల్సిన గమ్యాన్ని అదే చూపిస్తుంది. ఏ మలుపు ఎక్కడ తిరగాలో కూడా చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లో ఉపగ్రహాలు మొత్తం భూమిని కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా అందించే సమాచారాన్ని మనకు అందుబాటులోకి తెస్తాయి. అయితే ఇప్పుడు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీపీఎస్ కు బదులుగా ఇండిజినస్ పొజిషన్ డిటర్మినేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థను స్థాపించనుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ను ఉపయోగించి... జీపీఎస్‌ను భర్తీ చేసేలా ఈ కొత్త విధానం వచ్చే ఏడాది మధ్యనాటికి అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రారంభమౌతుందని, ఇస్రో ప్రచురణ ప్రజా సంబంధాల డైరెక్టర్ దేవీప్రసాద్ కార్నిక్ చెప్తున్నారు. పూర్తిగా భారత ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఈ కొత్త ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) దేశంలోని యూజర్లకు సరైన సమాచారాన్ని, స్థానాన్ని అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే... సిగ్నల్స్ మరింత మెరుగ్గానూ, కచ్చితంగానూ ఉంటాయని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో ఉండే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్... అన్ని పరిస్థితుల్లోనూ మనకు సేవలు అందిస్తుందన్న హామీ లేకపోవడంతో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అవసరమౌతుందని భావిస్తున్నారు. రెండు విధాలుగా సేవలు అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (SPS). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). మిలట్రీ సహా కొంతమంది ప్రముఖ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం విపత్తు నిర్వహణ, వాహన ట్రాకింగ్, నౌకా నిర్వహణ సహా మొబైల్ ఫోన్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన లింకులు, వాహనాలు నడిపేవారికి విజువల్, వాయిస్ నేవిగేషన్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. మొత్తం ఏడు ఉపగ్రహాలతో పనిచేసే ఈ సిస్టమ్ లో ప్రస్తుతం నాలుగు ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా మిగిలిన మూడింటిని వచ్చే ఏడు జనవరి, మార్చి మధ్య స్థాపించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం జీపీఎస్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటంతో తాము సొంత సిగ్నల్‌తో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు ఇస్రో అధికారులు చెబుతున్నారు. -
ఆధ్యాత్మిక బాటలో ‘ఫోర్టిస్’ శివిందర్ సింగ్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శివిందర్ మోహన్ సింగ్ (40) తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆధ్యాత్మిక సంస్థ రాధా స్వామి సత్సంగ్ బియాస్లో చేరేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా మాత్రమే ఉంటారని సంస్థ పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కంపెనీ ఏర్పాటు, నిర్వహణలో కీలక పాత్ర పోషించానని, ఇకపై సమాజ సేవలో ప్రత్యక్షంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సింగ్ తెలిపారు. పెద్దన్న మాల్విందర్ సింగ్‌తో కలిసి శివిందర్.. 1990లలో ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను ఏర్పాటు చేశారు. 2008లో ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీలో తమ వాటాలను దైచీ శాంక్యోకి సోదరులిద్దరూ విక్రయించారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి శివిందర్ ఎంబీయే చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ చెయిన్‌కి భారత్ సహా దుబాయ్, మారిషస్, శ్రీలంకలో పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా పాప వయసు ఎనిమిది నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. దీనికి ఏదైనా చికిత్స అవసరమా? - వీణ, నిడదవోలు మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది.పిల్లలను ఎప్పుడూ ఒకే పొజిషన్లో పడుకోబెట్టినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పొజిషనల్ సెఫాలీ అయితే చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషి యన్‌కు చూపించి ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం .సమస్య తగ్గింది అయితే ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా జరిగే అవకాశం ఉందా? శాంతిశ్రీ, భీమవరం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి లక్షణాలూ రావచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీ బయాటిక్ కోర్సులతో చికిత్స చేయాలి. నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. . మీరు ఒకసారి పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
నకిలీ.. మకిలీ
ప్రథమ పౌరుడి పదవీ పాట్లు సాక్షి, కర్నూలు: జిల్లా ప్రథమ పౌరుడు నకిలీ మద్యం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పదవిని కాపాడుకునేందుకు.. కేసు నుంచి బయటపడేందుకు టీడీపీ ముఖ్య నేతకు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదయ్యాక ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడిపిన ఆయన.. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్న కార్యక్రమాల్లో మాత్రమే తారసపడ్డారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో.. కలెక్టరేట్లో నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వేదికను అలంకరిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్య నేత భరోసాతోనే ఆయన జనజీవన శ్రవంతిలోకి వచ్చినట్లు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నకిలీ మద్యం కేసులో ఎ-5గా ఉన్న జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఎక్సైజ్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసుతో జెడ్పీ ప్రతిష్ట మంటగలిసింది. ‘నకిలీ మద్యం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోండని.. ఎలాంటి ఇబ్బందులొచ్చినా తాను అండగా నిలుస్తా’నంటూ స్వయంగా జెడ్పీ చైర్మన్ తమకు భరోసానిచ్చినట్లు ఆ కేసులో నిందితులుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమామహేశ్వరగౌడ్‌లు పోలీసుల ఎదుట అంగీకరించారు. జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్ సహకారంతో చైర్మన్‌ను కర్నూలులోని మౌర్యాఇన్ హోటల్లో కలిసినట్లు వారు స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు పీఏపైనా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తర్వాత చైర్మన్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు తక్షణమే రాజశేఖర్‌గౌడ్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని.. లేకపోతే పార్టీ పరువు, ప్రతిష్ట దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని అధినేత ముందుంచారు. రూ.4 కోట్లకు డీల్! వ్యయప్రయాసలకోర్చి జెడ్పీ పీఠం దక్కించుకున్న రాజశేఖరగౌడ్.. ఆ సంతోషం మూన్నాల్ల ముచ్చట కాకూడదనే ఉద్దేశంతో పదవిని కాపాడుకునేందుకు ముప్పుతప్పలు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఎంతో కష్టం మీద టీడీపీకే చెందిన ఓ ముఖ్యనేత, ఆయన సోదరుల ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వారు సూచించడంతో కాసుల బేరానికి దిగినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించడమో.. లేదంటే అరెస్టు కాకుండా చూడటమో చేస్తే రూ.4కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు వినికిడి. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్ రాజశేఖరగౌడ్ అజ్ఞాతం వీడినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో నందికొట్కూరుకు చెందిన టీడీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డీల్‌కు సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయనే సమకూర్చినట్లు సమాచారం. ఇదిలాఉంటే నకిలీ మద్యం కేసు నుంచి బయటపడేందుకు చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ తన పీఏ రాజశేఖర్ అలియాస్ చిక్కా నాగశేఖరప్పను కూడా బలిపశువును చేసేందుకు వెనుకాడటం లేదని చర్చ కొనసాగుతోంది. -
1993లో ఓ స్థలం
తాళ్లూరు: మండలం కేంద్రంలో నిరుపేదలకు కేటాయించిన నివాస స్థలాలకు పొజిషన్ చూపడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 1993లో తాళ్లూరు గ్రామానికి దక్షణంవైపున ఉన్న సర్వే నెం.294/2లో ఎనిమిది ఎకరాలు 300 మంది నిరుపేదలకు పంపిణీ చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ స్థలాల్లో ఇంటిని నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఒక లేఖ కూడా పంపారు. అధికారులు మాత్రం పొలాన్ని సబ్ డివిజన్‌గా విడగొట్టి నేటికీ పొజిషన్ చూపించలేదు. ఇదిలా ఉండగా 2010 సెప్టెంబర్‌లో మోడల్ పాఠశాల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు పేదలకు కేటాయించిన సర్వే నెం.294/2లో భూమి అనుకూలంగా ఉందని గ్రహించి పట్టాలు రద్దుచేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన లబ్ధిదారులు ఈ సర్వే నంబర్లో మొత్తం 13 ఎకరాలున్నాయని, పేదలకు పంపిణీ చేయగా మిగిలిన స్థలాన్ని మోడల్ స్కూల్‌కు మంజూరుచేయాలని సూచించారు. కాని ఆదిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూశాఖ స్పందించి పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపాలను లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ ఇంద్రాదేవి మాట్లాడుతూ నిరుపేదలకు పట్టాలు ఇచ్చినట్లు, వాటిని రద్దు చేస్తూ నోటీసులు జారీ అయినట్టు తెలిసిందన్నారు. నేను బాధ్యతలు తీసుకుని 47 రోజులు మాత్రమే అయ్యింది, పూర్తిగా అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
సయాటికా (గుద్రసీ వాతము)
ప్రస్తుత పరిస్థితిలో మానవుని జీవితము చాల యాంత్రికముగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్న విపర్యయము (పగతి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాలలో అనేక మార్పులు రావటం వలన. ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. దీనికి సాధారణ కారణాలు పరిశీలించి చూసినట్లయితే... ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చొనుట, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా పైన వివరించిన కారణాల వలన శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఆయుర్వేద చికిత్స ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స. 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సాపద్ధతి ఉంది. ఈ చికిత్సా పద్ధతి ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. 1. స్నేహకర్మ: ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి, తద్వారా జాయింట్స్‌లో కదలికలను తేలికగా చేయవచ్చును. 2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్‌ను మృదువుగా అయ్యేటట్లు చేయవచ్చును. కటివస్తి: ఈ పద్ధతి ఈ వ్యాధిలో అతి విశిష్టతను సంతరించుకున్నది. ఈ ప్రక్రియ ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి తద్వారా నొప్పి తీవ్రతను తగ్గించవచ్చును. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే విశిష్ట చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదేవిధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. జాగ్రత్తలు: సరి అయిన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చును. డిస్క్‌లో వచ్చే మార్పులు ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంట తో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చు. డాక్టర్ కరుణశ్రీ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 9908911199 / 9959911466