తాళ్లూరు: మండలం కేంద్రంలో నిరుపేదలకు కేటాయించిన నివాస స్థలాలకు పొజిషన్ చూపడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 1993లో తాళ్లూరు గ్రామానికి దక్షణంవైపున ఉన్న సర్వే నెం.294/2లో ఎనిమిది ఎకరాలు 300 మంది నిరుపేదలకు పంపిణీ చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ స్థలాల్లో ఇంటిని నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఒక లేఖ కూడా పంపారు.
అధికారులు మాత్రం పొలాన్ని సబ్ డివిజన్‌గా విడగొట్టి నేటికీ పొజిషన్ చూపించలేదు. ఇదిలా ఉండగా 2010 సెప్టెంబర్‌లో మోడల్ పాఠశాల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు పేదలకు కేటాయించిన సర్వే నెం.294/2లో భూమి అనుకూలంగా ఉందని గ్రహించి పట్టాలు రద్దుచేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన లబ్ధిదారులు ఈ సర్వే నంబర్‌లో మొత్తం 13 ఎకరాలున్నాయని, పేదలకు పంపిణీ చేయగా మిగిలిన స్థలాన్ని మోడల్ స్కూల్‌కు మంజూరుచేయాలని సూచించారు.
కాని ఆదిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూశాఖ స్పందించి పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపాలను లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ ఇంద్రాదేవి మాట్లాడుతూ నిరుపేదలకు పట్టాలు ఇచ్చినట్లు, వాటిని రద్దు చేస్తూ నోటీసులు జారీ అయినట్టు తెలిసిందన్నారు. నేను బాధ్యతలు తీసుకుని 47 రోజులు మాత్రమే అయ్యింది, పూర్తిగా అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
1993లో ఓ స్థలం
Published Mon, Aug 18 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement