ఆవరణ చెరువు.. రక్షణ కరువు.. | kakinada anganwadi | Sakshi
Sakshi News home page

ఆవరణ చెరువు.. రక్షణ కరువు..

Published Wed, Aug 17 2016 11:17 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

ఆవరణ చెరువు.. రక్షణ కరువు.. - Sakshi

ఆవరణ చెరువు.. రక్షణ కరువు..

తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల వద్ద సురక్షిత పరిస్థితులు కొరవడుతున్నాయి. జిల్లాలో ఓ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై ఓ చిన్నారికి నూరేళ్లూ నిండిన విషాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ దుర్ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోలేదనడానికి.. కాకినాడ రూరల్‌ మండలంలోని వలసపాకల అంగన్‌వాడీ కేంద్రమే నిదర్శనం. డ్రెయిన్ల నుంచి వచ్చే మురుగుతో పాటు కొంచెం వానపడ్డా ఆ కేంద్రం చుట్టూ నీటిమడుగు తయారవుతోంది. అందులోంచే తల్లులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారులు ప్రమాదానికి గురయ్యే ముప్పు పొంచి ఉంది. ఎలాంటి దుర్ఘటనా జరగకముందే అధికారులు కన్ను తెరవాలి. కేంద్రం ఆవరణను మెరక చేయడంతో పాటు ప్రహారీ నిర్మించి, దారిని ఏర్పాటు చేయాలి.
– కాకినాడ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement