
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పదవికి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్‌ఎస్ పార్టీ బీఫారం కూడా అందు కున్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆమె రాజీనా మాను ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్స న్‌గా సునీతా లక్ష్మారెడ్డి 27 డిసెంబర్ 2020న నియమితులయ్యారు. ఆమె పదవీ కాలానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆమె రాజీనామా చేయడం అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment