వైఎస్‌ఆర్‌సీపీలో పలువురికి స్థానం
Published Thu, Dec 22 2016 12:08 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పదవులను కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిని స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా, పి.ఆర్.వెంకటేశ్వరరెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, వంగాల పరమేశ్వరరెడ్డిని స్టేట్ అఫిలియేటెడ్ వింగ్ కమిటీలో యూత్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమించారు. జిల్లా కమిటీలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వి.రామ్మోహన్‌రెడ్డి జిల్లా కార్యదర్శిగా, బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన డి.రామసుబ్బారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, వెంకటశివారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులయ్యారు. కర్నూలు సిటీ అఫిలియేటెడ్ వింగ్ ప్రెసిడెంట్స్‌లో కర్నూలు నియోజకవర్గానికి చెందిన పెయ్యల కిషోర్‌ను కర్నూలు సిటీ ఆటోరిక్షా వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్‌ఆర్‌టీయూసీ), ఎస్.వహీదాను కర్నూలు సిటీ బీడీ వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్‌ఆర్‌టీయూసీ) నియమించారు.
Advertisement
Advertisement