నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం | ysrcp district plenary | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం

Published Fri, Jun 16 2017 10:23 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం - Sakshi

నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం

- కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు హాజరుకావాలి
- పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
కాకినాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించామని, జిల్లా స్థాయి ప్లీనరీ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. జిల్లా ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే అంశంతోపాటు, సమావేశ అజెండా, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లా ప్లీనరీకి పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ పరిశీలకులుగా పార్టీ నియమించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరవుతారన్నారు. సన్నాహక సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలు విధిగా హాజరుకావాలని కన్నబాబు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement