
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి పోటీపడనున్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఆన్‌లైన్ బ్యాలట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు సలహాదారుడైన వ్యాపారవేత్త సయ్యద్ జుల్ఫీ బుఖారీ శుక్రవారం జియో న్యూస్‌కు తెలిపారు.
ఇమ్రాన్ ఆక్స్‌ఫర్ యూనివర్శిటీ పూర్వ విద్యారి్థ. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. 2005–2014 దాకా ఆయన బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్శిటీ చాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి గౌరవ హోదా.. పూర్వ విద్యార్థులు దీని కోసం పోటీపడటానికి అర్హులు. రాజకీయ నాయకులకు ఈ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఈసారి పోటీలో ఉన్నారు.