
ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫోసిస్
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్‌ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి.
ఇక ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, భారత్ ఫోర్జ్, అలెంబిక్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి తదితర 14 కంపెనీలు కొత్తగా స్థానం దక్కించుకున్నాయి. అమ్మకాల వృద్ధి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల వంటి తదితర అంశాల ప్రాతిపదికన పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యంతో జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ వివరించింది.