సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయపార్టీలు అధికారికంగా కాకపోయినా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశాయి. విజయనగరం నియోజకవర్గలో మహిళా ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో అతివలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కళలకు కాణాచిగా, విద్యలకు నిలయంగా, సాంస్కృతిక రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విజయనగరం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో మహిళలే నిర్ణయిస్తారు.నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ప్రభావం చూపుతుంటారు.
జనాభా వివరాలు..
పట్టణ జనాభా | 2,83,550 |
పురుషులు | 1,39,900 |
మహిళలు | 1,43,650 |
ఎస్సీ జనాభా
పట్టణం | 27,087 |
పురుషులు | 13,193 |
మహిళలు | 13,894 |
ఎస్టీ జనాభా
పట్టణం | 2773 |
పురుషులు | 12220 |
మహిళలు | 1553 |
మండలం..
మండల జనాభా | 41,709 |
పురుషులు | 21,190 |
మహిళలు | 20,519 |
ఎస్సీ జనాభా
మండలం | 3351 |
పురుషులు | 1718 |
మహిళలు | 1633 |
ఎస్టీ జనాభా
మండలం | 726 |
పురుషులు | 381 |
మహిళలు | 345 |
విజయనగరం నియోజకవర్గంలో మొత్తంఓటర్లు..
ప్రాంతం | పోలింగ్ కేంద్రాలు |
పురుషులు | మహిళలు | ఇతరులు |
విజయనగరం మున్సిపాలిటీ | 219 | 88,553 | 91,785 | 25 |
విజయనగరం మండలం | 41 | 15,116 | 15,241 | 2 |
మొత్తం | 260 | 1,03,669 | 1,07,026 | 27 |
Comments
Please login to add a commentAdd a comment