women voters Highest
-
డిసైడ్ చేసేది.. ఆమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేపు జరగనున్న ఎన్నికల్లో ‘విజేత’ను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పై చేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా నాలుగు వేల నుంచి పది వేలకు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది.2014తో పోల్చి చూస్తే 2019లో మహిళా ఓటర్ల పోలింగ్ కూడా భారీగా పెరిగింది. అదేవిధంగా ఈ నెల 13న అసెంబ్లీకి, లోక్‌సభకు జరిగే పోలింగ్‌లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. పోలింగ్‌లో పాల్గొనే మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతులు దాదాపు నాలుగు లక్షల మంది తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.2019లో మాదిరిగానే ఈసారి కూడా పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని చోట్లా పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల లబ్ధిదారుల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నందున.. వారంతా ‘ఫ్యాన్’కు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు.మహిళా కూలీల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, గృహిణులు, యువతులు వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో పాటు సొంతింటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా రూ.2,83,866.33 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది.ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,89,519.07 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347.26 కోట్లు ప్రయోజనం చేకూరింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీకి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. -
మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.96 కోట్ల పురుష ఓటర్లుండగా 2.01 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలుగా ఉన్నారు. విశాఖపట్టణం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే మహిళలకన్నా పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా 24 జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9.65 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.60 లక్షలు, అనంతపురం జిల్లాలో 9.56 లక్షలు, విశాఖ జిల్లాలో 9.38 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 9.10 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సాధారణ ఓటర్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19.12 లక్షల ఓటర్లు ఉండగా ఆ తరువాత అనంతపురం జిల్లాలో 19.11 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 18.98 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 12.61 లక్షల ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.68 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.15 లక్షల ఓటర్లు ఉన్నారు. -
గెలుపు ఓటముల్లో అతివలదే హవా..
సాక్షి, దుబ్బాక: జిల్లాలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో వారి తీర్పే కీలకం కానుంది. మున్సిపల్ అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు లెక్క తేల్చారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా సిద్దిపేట మినహా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది. అధికంగా మహిళా ఉండటంతో మెజార్టీ సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లుగా మహిళలకే అవకాశం దక్కనుంది. మహిళలకు 50 శాతం వాటా ఉండడంతో పురుషుల కంటే మహిళ కౌన్సిలర్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.త్వరలోనే చైర్మన్లు, కౌన్సిలర్లకు రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ఏ మున్సిపాలిటీ చైర్మన్ మహిళకు దక్కుతుందో..? అని మున్సిపల్లో ఏ వార్డులు మహిళలకు రిజర్వు అవుతాయోనన్న తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 79,401 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 40,176 మంది, పురుషులు 39,224 మంది ఉన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 9,785 ఉండగా.. మహిళలు 10,286 మంది ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 501 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. హుస్నాబాద్‌లో 8,665 మహిళలు, 8,407 పురుష ఓటర్లున్నారు.ఇక్కడ 258 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. గజ్వేల్‌లో 15,078 మహిళలు, 15,052 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 26 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. చేర్యాలలో 6,147 మంది మహిళలు, 5,918 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 167 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. పై చేయి వారిదే.. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో మహిళల ఓట్లే అత్యధికంగా పోల్ కావడంతో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లోను నారీమణులే కీలకంగా మారనున్నారు. గెలుపు, ఓటము నిర్ణయించడంలో వారిదే కీలక పాత్ర ఉండనుంది. అన్ని మున్సిపాల్టిల్లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యత ప్రముఖంగా తయారైంది. పోలింగ్ శాతం కూడా గత ఎన్నికల మాదిరిగా మున్సిపల్లో కూడ మహిళలదే పై చేయిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా జిల్లాలో పురుషుల కంటే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
నిర్ణయం ఆమెదే..
సాక్షి, ఖమ్మం : పార్టీ ఏదైనా.. అభ్యర్థి ఎవరైనా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపును నిర్ణయించేది మహిళలే. వీరిదే కీలక పాత్ర. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లకన్నా.. మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో వీరి ఓటే కీలకంగా మారనుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలే ప్రధాన భూమిక అయ్యే అవకాశం ఉంది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో.. ఏ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిధిలో మహిళా ఓటర్లే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక వరాలు ప్రకటిస్తున్నారు. తీరొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు, ఇతర మహిళా సంఘాలకు పార్టీలపరంగా చేసిన మేలును గుర్తు చేస్తూ.. మహిళల కోసం ఆయా పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు 10,83,175 మంది ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 5,31,515 మంది, మహిళా ఓటర్లు 5,51,584 మంది, ఇతరులు 76 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,096 మంది అధికంగా ఉన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మహిళా ఓటర్లే ఎక్కవగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించే సమయంలో సైతం ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడంతో ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటర్ల వివరాలు ఇలా నియోజకవర్గం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం ఖమ్మం 1,41,672 1,51,896 32 2,93,600 పాలేరు 1,05,736 1,10,885 01 2,16,622 మధిర 1,03,009 1,07,342 07 2,10,358 వైరా 90,281 93,001 04 1,83,286 సత్తుపల్లి 1,13,921 1,16,501 04 2,30,426 కొత్తగూడెం 1,11,440 1,17,142 15 2,28,597 అశ్వారావుపేట 73,466 76,736 03 1,50,205 -
విజేత నిర్ణయంలో..మహిళామణులు
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయపార్టీలు అధికారికంగా కాకపోయినా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశాయి. విజయనగరం నియోజకవర్గలో మహిళా ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో అతివలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కళలకు కాణాచిగా, విద్యలకు నిలయంగా, సాంస్కృతిక రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విజయనగరం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో మహిళలే నిర్ణయిస్తారు.నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ప్రభావం చూపుతుంటారు. జనాభా వివరాలు.. పట్టణ జనాభా 2,83,550 పురుషులు 1,39,900 మహిళలు 1,43,650 ఎస్సీ జనాభా పట్టణం 27,087 పురుషులు 13,193 మహిళలు 13,894 ఎస్టీ జనాభా పట్టణం 2773 పురుషులు 12220 మహిళలు 1553 మండలం.. మండల జనాభా 41,709 పురుషులు 21,190 మహిళలు 20,519 ఎస్సీ జనాభా మండలం 3351 పురుషులు 1718 మహిళలు 1633 ఎస్టీ జనాభా మండలం 726 పురుషులు 381 మహిళలు 345 విజయనగరం నియోజకవర్గంలో మొత్తంఓటర్లు.. ప్రాంతం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు విజయనగరం మున్సిపాలిటీ 219 88,553 91,785 25 విజయనగరం మండలం 41 15,116 15,241 2 మొత్తం 260 1,03,669 1,07,026 27 -
ఆమె ఓటే కీలకం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఆమె ఓటే అభ్యర్థుల తలరాత మార్చేది.. గెలుపు, ఓటములను నిర్దేశించేది.. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల భవితవ్యం మహిళల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల ఫలితాలు వారిపైనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి అతివలకు మాత్రమే ఉంది. అందుకే అన్ని పార్టీలు ‘ఆమె’ను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హామీలతో తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయి. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను మహిళలే నిర్ణయించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లా అధికారులు త్వరలో ప్రకటించనున్న తుది జాబితా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. జిల్లాలో మొత్తం 17,77,678 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 9,24,331 మంది కాగా, పురుషులు 8,53,204 మంది, మరో 143 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 2,41,424 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గంలో 1,73,226 ఉన్నట్లు తేలింది. జిల్లాలో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా బాల్కొండలో మహిళలు జిల్లాలో అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 15,596 మంది అధికంగా ఉన్నట్లు తేలింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో కూడా పురుషుల కంటే 14,312 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఒక్క జుక్కల్ నియోజకవర్గంలో మాత్రం ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది. పురుషుల కంటే స్త్రీలు 1,961 మంది ఎక్కువ ఉన్నారు. డిసెంబర్ 7 తేదీన జరగనున్న పోలింగ్‌లో మహిళలే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. -
అతివదే అగ్రస్థానం
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లా నాయకుల భవితవ్యం తమ చేతుల్లోనే ఉందనే విషయూన్ని అతివలు మరోసారి తేల్చి చెప్పారు. ఓటర్ల నమోదులో ఈసారి కూడా మన జిల్లా మహిళలు అధిక్యతను కొనసాగించారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 35వేల 952మంది ఉన్నట్లు 2014 ఓటర్ల గణాం కాలు స్పష్టం చేశాయి. ఒక్క గోపాలపురం నియోజకవర్గం మినహా.. 14 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం కావటం విశే షం. అధిక శాతం యువతీ యువకులు సైతం ఓటుహక్కు పొందారు.ఎన్నికల సంఘం జారీ చేసిన తుది ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే... జిల్లాలో మొత్తం ఓట ర్లు 28లక్షల 12వేల 472 మంది కాగా, వారిలో మహిళలు 14లక్షల 24వేల 212 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 13లక్షల 88వేల 260 మందిగా లెక్క తేలారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గంగా చింతలపూడి రికార్డు దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 30వేల 029 మంది కాగా, పురుషులు 1లక్షా 14వేల 741 మంది. మహిళలు 1లక్షా 15వేల 288 మంది ఉన్నారు. రెండు, మూడు స్ధానాల్లో తణుకు, భీమవరం నియోజకవర్గాలు నిలిచాయి. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న నియోజకవర్గంగా నరసాపురం నిలిచింది. జాబితాల ప్రదర్శన జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. తుది ఫొటో ఓటరు జాబితాలు శనివారం జిల్లాకు చేరాయి. అధికారులు వాటిని హడావుడిగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఓటర్ల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. జిల్లాకు వచ్చిన 13వేల 151 కొత్త ఓటరు గుర్తింపు కార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేసేందుకు సన్నద్ధమయ్యూరు. యువత జోష్ ఓటు హక్కు పొందటం ద్వారా ప్రజాప్రతినిధుల జాతకాలను మార్చేందుకు యువత రంగంలోకి దిగింది. గత ఏడాది ఓటర్ల నమోదు సందర్భంగా 28 వేల మంది యువతీ యువకులు నమోదయ్యూరు. ఈసారి 18-19 సంవత్సరాల మధ్య వయసు గలవారు 73వేల 329 మంది ఓటర్లుగా నమోదయ్యూరు. సగటున ప్రతి నియోజకవర్గంలోను ఐదు వేల మంది యువ ఓటర్లు నమోదయ్యూరు. వీరిలో సగం మంది కార్యాలయాల జోలికి వెళ్లలేదు. ఆన్లైన్ ద్వారా ఓటర్లుగా నమోదయ్యూరు. వయసుల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా... ఈసారి ఓటర్లను వయసుల వారీగా లెక్కతేల్చారు. యువ ఓటర్ల సంఖ్యను తెలుసుకునేందుకే ఇలా చేశారని సమాచారం. అయితే ఏ నియోజకవర్గంలో ఎంత మంది యువ ఓటర్లు ఉన్నారనేది అధికారులు బయట పెట్టడం లేదు. సూత్రప్రాయంగా సంఖ్యలను చెప్పటం విమర్శలకు తావిచ్చింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 73,329 మంది, 20-29 వయసువారు 7లక్షల 64వేల 994 మంది ఉన్నారు. 30-39 ఏళ్ల వారు 6లక్షల 97వేల 314 మంది కాగా, 40-49 ఏళ్ల వారు 5లక్షల 44వేల 653 మంది ఉన్నారు. 50-59 ఏళ్ల వారు 3లక్షల 80వేల 741 మంది, 60-69 ఏళ్ల వారు 2లక్షల 23వేల 184 మంది, 70-79 ఏళ్ల వారు 1లక్షా 06వేల 187 మంది, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 22,070 మంది ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. 2013 నవంబర్ 18 నాటికి నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల సంఖ్య, జనవరి 31న ఖరారు చేసిన ఓటర్ల సంఖ్యలను పక్క పట్టికల్లో చూడవచ్చు.