
లక్నో : దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు యువకులను ఎలక్ట్రిక్ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. అసిఫ్, ఇక్బాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం మూడు గంటల ప్రాంతంలో రాకేష్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో చొరబడి డబ్బు దొంగలించడానికి ప్రయత్నించరనే అనుమానంతో వారిని బంధించారు. అనంతరం ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టేసి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మీద దాడి చేసిన వారి మీద కేస్ ఫైల్ చేశారు.