విద్యుత్‌ స్తంభం మీదపడి యువకుడి మృతి | felldown from pole one died | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం మీదపడి యువకుడి మృతి

Published Sun, Aug 7 2016 11:36 PM | Last Updated on Mon, Oct 1 2018 6:22 PM

felldown from pole one died

మేళ్లచెర్వు: విద్యుత్‌ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం మండలంలోని కందిబండ గ్రామపంచాయతీ పరిధిలో గల నల్లబండ గూడెం గ్రామం వద్ద విద్యుత్‌ లైన్‌ లాగే క్రమంలో గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన దినసరి కూలీలు స్తంభాలు నిలబెట్టుతుండగా కరెంటు తీగలు స్తంభానికి తగిలి షాక్‌ వచ్చింది. దీంతో స్తంభాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టడంతో మీదపడి  కుంభం అనిల్‌(20) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement