Andhra Pradesh: Software Employee Died In Road Accident In Chittoor District - Sakshi
Sakshi News home page

భార్య గర్భిణిగా ఉందని చూడటానికి వచ్చి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి 

Published Mon, Aug 21 2023 12:24 AM | Last Updated on Mon, Aug 21 2023 12:53 PM

- - Sakshi

చిత్తూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలో జరిగింది. చిత్తూరు జిల్లాలో ని పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన శివశంకర్‌ కుమార్తె పల్లవిని బెంగళూరు నార్త్‌ వైట్‌ఫీల్డ్‌ గాంధీపుర మసీదు వీధికి చెందిన అంజనప్ప కుమారుడు బి.ఏ.యశ్వంత్‌కుమార్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. పల్లవి గర్భం దాల్చడంతో నెలరోజుల క్రితం పుట్టినిల్లు అయిన కృష్ణాపురానికి వచ్చింది. శనివారం యశ్వంత్‌కుమార్‌ భార్యను చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి కృష్ణాపురం వచ్చాడు.

కొద్దిసేపు ఇంటి వద్ద గడిపిన అనంతరం రాత్రి 9.45 గంటలకు వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి కృష్ణాపురానికి వెళుతుండగా మదనపల్లె–బోయకొండ రోడ్డులోని వలసపల్లె సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన యశ్వంత్‌కుమార్‌కు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో పడి ఉన్న యశ్వంత్‌కుమార్‌ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement