Watch: Video Of Two Women Pole Dancing Inside Delhi Metro, Netizens Reactions Viral - Sakshi
Sakshi News home page

Delhi Metro Women Pole Dance Video: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..

Published Sat, Jul 8 2023 10:46 AM | Last Updated on Sat, Jul 8 2023 11:14 AM

Video Of Two Women Pole Dancing Inside Delhi Metro - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్‌ స్ప్రే కొట్టింది. తాజాగా ఇద్దరు యువతులు మోడర్న్ డ్రస్ వేసుకుని బాలీవుడ్ సాంగ్‌కు మెట్రోలో పోల్‌ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

'మెయిన్ టూ బెఘర్ హున్' సాంగ్‌కు యువతులు లిప్‌ సింక్ చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ పాట సుహాగ్‌ చిత్రంలోని కాగా.. ప్రవీణ్ బాబీ, శశి కపూర్‌ నటించారు. ఈ పాటకు యువతులు పోల్ పట్టుకుని కింద నుంచి మీదకు లయబద్దంగా ఊగుతూ హోరెత్తించే స‍్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సులు చూస్తే ‍అలాగే ఉండిపోయారు తోటి ప్రయాణికులు. ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 

ఈ వీడియో వైరల్‌ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికుల తీరు మారట్లేదని వాపోతున్నారు. వైరల్ కావడానికి మెట్రో ఓ సాధనంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. 

ఇదీ చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement