విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | man died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Sun, May 28 2017 11:59 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

man died by electric shock

- గొడిగెనూరు గ్రామంలో ఘటన
–మ​ృతికి విద్యుత్‌శాఖ అధికారులే కారణమని బంధువుల ఆరోపణ
 
గొడిగెనూరు(చాగలమర్రి): చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మ​ృతిచెందాడు. ఈ ఘటనకు ట్రాన్స్‌కో అధికారుల తీరే కారణమని గ్రామస్తులు, మ​ృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (30) విద్యుత్‌ లైన్‌మెన్‌ సుధాకర్, ఏఎల్‌ఎం నాగశేషులతో గ్రామంలోని విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి వెలుతుండే వాడు.  లైన్‌మెన్‌   సెలవు పెట్టడంతో ఏఎల్‌ఎం  ఆదివారం గొడిగెనూరు 11కేవీ రిపేరీ కోసం సుబ్రమణ్యంను స్తంభం ఎక్కించారు. అయితే,  మరమ్మతు చేస్తున్న   విద్యుత్‌ స్తంభం​ పక్కనే 765 పవర్‌గ్రిడ్‌ విద్యుత్‌ తీగలు ఉన్నాయి. ఈ విద్యుత్‌ తీగల ఇండెక‌్షన్‌ సుబ్రమణ్యంకు తగలడంతో షార్ట్‌సర్య్యూట్‌ అయి స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు.
 
  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.  సబ్‌ ఇంజినీర్‌ షాజహాన్, విద్యుత్‌ సిబ్బంది రామక​ృష్ణారెడ్డి లతో  వాగా​​‍్వదానికి దిగారు. ఏమి తెలియని సుబ్రమణ్యంను   ఏఎల్‌ఎం నాగశేషు విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కించి నిండు ప్రాణం తీశాడని ఆరోపించారు. ఈ దుఃఖంలో మ​ృతుడి బంధువులు విద్యుత్‌సిబ్బందిని పట్టుకొని చితకబాదారు. మృతుడికి భార​‍్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటా​‍్టరు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement