
కౌలలాంపూర్ : ఇన్‌స్టాగ్రామ్ పోల్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఆమె ఫాలోవర్లు చేసిన సూచనలతో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సరవాక్‌కు చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోల్ కండక్ట్ చేసింది. దానిలో ‘ఇది నాకు చాలా ముఖ్యం. చావో, బతుకో తేల్చుకోవడంలో నాకు సాయం చేయండి’ అంటూ తన ఫాలోవర్లను కోరింది. ఏదో సరదాకు అనుకున్న నెటిజన్లు.. దాదాపు 69 శాతం మంది ఆమెను చనిపోమ్మని సూచించారు. దాంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయంపై రామ్‌కర్పాల్ సింగ్ అనే ఎంపీ, లాయర్ స్పందిస్తూ.. ‘పోల్‌లో పాల్గొని చనిపోమని సూచించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు చనిపోమ్మని సలహా ఇచ్చింది వారే. తమ సమాధానం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వారు ఊహించలేకపోయారు. యువతి అనాలోచిత చర్యకు వీరు మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment