స్టార్ హీరోయిన్‌ సౌందర్య మళ్లీ పుట్టిందా?.. అచ్చం ఆమెలానే అలరిస్తోంది! | Social Media Star Chitra Looks Like Same As Star Heroine Soundarya | Sakshi

Soundarya: స్టార్ హీరోయిన్ సౌందర్య.. ఆ అందాన్ని మళ్లీ చూసినట్టుందే!

Oct 31 2023 3:00 PM | Updated on Oct 31 2023 3:24 PM

Social Media Star Chitra Looks Like Same As Star Heroine Soundarya - Sakshi

తెలుగులో స్టార్‌ హీరోయిన్లలో సౌందర్య ఒకరు. అప్పట్లో మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె మృతిని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

భౌతికంగా సౌందర్య దూరమైన ఆమె సినిమాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. మహానటి సావిత్రి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య పేరే వినిపిస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సౌందర్య  తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో  నటించింది. 12 ఏళ్ల పాటు వెండితెరపై అభిమానులను అలరించింది. 

అయితే అచ్చం సౌందర్యలాగే అమ్మాయి సోషల్ మీడియాలో అలరిస్తోంది. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్‌ ఉన్న సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. చూడడానికి సేమ్ టు సేమ్ మన సౌందర్యలాగే ఉండడం ఆమెకు కలిసొచ్చింది. చిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మనదేశంలోని అభిమానులకు సైతం దగ్గరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన చిత్ర తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

చిత్ర మాట్లాడుతూ..' మా అమ్మది తమిళనాడు. నేను పుట్టి పెరిగింది మాత్రం మలేషియాలోనే. నేను కన్నడ, తెలుగు భాషలు అర్థం చేసుకోగలను. ఆమెలాగే ఉండడం నా అదృష్టం. మలేషియా నుంచే నేను రీల్స్ చేస్తున్నా. సినిమాల్లో నటించమని తెలుగువాళ్లు కొంతమంది నాకు కాల్స్ చేశారు. నాకు యాక్టింగ్ రాదు. సౌందర్య నటించిన అమ్మోరు, అంతఃపురం సినిమాలంటే ఇ‍ష్టం. సౌందర్య కుటుంబ సభ్యులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు చిత్ర తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement