తయారు చేసిన పరికరంతో శివ, స్తంభం ఎక్కుతున్న శివ
- విద్యుత్ స్తంభం ఎక్కడం ఆపరేటర్లు, హెల్పర్లకు ఎంతో కష్టం. వీరికి నిర్వహించే పరీక్షలోనూ కీలకాంశం స్తంభం ఎక్కడమే. ఎంతో క్లిష్టమైన ఈ పనిని ఓ చక్కని ఐడియాతో సులభం చేసేశాడు ఇల్లెందు ఎల్బీఎస్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మోతుకూరి శివ. కేవలం రూ.200 ఖర్చుతో కూడిన ఈ పరికరం తయారీ గురించి.. ‘ఓ రెండు ఇనుపరాడ్డులు తీసుకొని స్తంభానికి పట్టుకొని ఉండే విధంగా ఒక్కోదానికి రెండు ఇనుప బోల్ట్‌రాడ్‌ల చొప్పున వెల్డింగ్ పెట్టించాడు. ప్రధాన రాడ్డు మరో చివర తీగలతో చెప్పు అమర్చాడు. ఇలా రెండు రాడ్‌లను తయారు చేసి.. ముందుగా ఒక రాడ్డును స్తంభానికి పెట్టి.. దానిపైన మరో రాడ్డు..ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ ఆ రెండు రాడ్‌ల సహాయంతో ఈజీగా స్తంభం ఎక్కేశాడు. ఈ పరికరాన్ని చూసి స్థానిక విద్యుత్ అధికారులు తమ సిబ్బందికి వీటిని అందించాలని ఆలోచన చేశారు. దీన్ని తయారు చేసిన శివను అభినందించారు. – ఇల్లెందు అర్బన్