సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్ము రేపాడు. బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో అతను ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 26.600 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
గతంలో నాలుగుసార్లు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గిన హామిల్టన్ మళ్లీ గెలిస్తే ఐదు టైటిల్స్‌తో తన దేశానికి చెందిన జిమ్ క్లార్క్ రికార్డును సమం చేస్తాడు. ఫెరారీ డ్రైవర్లు కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
హామిల్టన్‌కు ‘పోల్’
Published Sun, Jul 16 2017 1:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
Advertisement