చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్‌ | chess first place nannaya university | Sakshi
Sakshi News home page

చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్‌

Published Sat, Sep 24 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్‌

చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్‌

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన చదరంగం పోటీల పురుషుల విభాగంలో నన్నయ యూనివర్సిటీ ప్రథమ, పీఆర్‌ ప్రభుత్వ కళాశాల (కాకినాడ) ద్వితీయ, డాక్టర్‌ బీవీఆర్‌ కళాశాల (భీమవరం) తృతీయ, బీఎస్‌ఎం కళాశాల (రామచంద్రపురం) చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అలాగే మహిళల విభాగంలో ఒకటి నుంచి నాలు స్థానాలను ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల, సెయింట్‌ మేరీస్‌ కళాశాల, సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల, వీఎస్‌ఎం కళాశాలలు దక్కించుకున్నాయి. విజేతలకు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు బహుమతులు అందజేశారు. 2016–17 యూనివర్సిటీ చదరంగం జట్టుకు ఎంపికైన బాలురులో వి.బాలరాజు (ఎస్‌కేవీఎస్, గోకవరం), కె.మహేష్‌ (నన్నయ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం), వై.వినయ్‌చంద్‌ (సీఎస్‌టీఎస్, జంగారెడ్డిగూడెం), టి.నగేష్‌ (పీఆర్‌ ప్రభుత్వ కళాశాల, కాకినాడ), బి.హరీష్‌ (వీఎస్‌ఎం కళాశాల, రామచంద్రపురం), జేజేఎస్‌ మణికుమార్‌ (జీబీఆర్‌ కళాశాల, అనపర్తి) ఉన్నారు. బాలికల విభాగంలో బి.సంకల్ప (సీఆర్‌ఆర్, ఏలూరు), ఎన్‌.పద్మకళ (ఎస్‌ఎంబిటీ – ఏవీఎస్‌ఎన్, వీరవాసరం), పీజీఎస్‌ సామరంజని (పీఆర్‌జీ, కాకినాడ), బి.మోహినికుమారి, ఎ.మౌనిక (ఎస్‌టీ థెరీసా, ఏలూరు), పి.కీర్తి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు), ఎంపికయ్యారు. విజేతలను, టీమ్‌ సభ్యులను ఉపకులపతితోపాటు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ పి.సురేష్‌వర్మ, డాక్టర్‌ కేఎస్‌ రమేష్, పలువురు అధ్యాపకులు అభినందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement