రెజ్లింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమం
పిఠాపురం టౌన్ : స్థానిక హనుమంతరాయ జూనియర్ కళాశాల విద్యార్థి మేడిశెట్టి కళ్యాణరావు రెజ్లింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. గత నెల 28, 29 తేదీల్లో కాకినాడలో జరిగిన ఏపీ మూడో సబ్ జూనియర్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ పోటీలు 58 కేజీల విభాగంలో అతడు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం సాధించి, స్వర్ణ పతకం అందుకున్నాడు. తద్వారా వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధిచాడు. కళ్యాణరావును కళాశాల ప్రిన్సిపాల్ డి.గంగామహేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.ఆనంద్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.