మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు! | Trump meets press with Bill Clinton accusers before debate | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు!

Published Mon, Oct 10 2016 8:56 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు! - Sakshi

మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు!

సెయింట్ లూయిస్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమపై లైంగిక దాడి జరిపాడంటూ నలుగురు మహిళలు ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ కు ముందు ఈ నలుగురు మహిళలతో కలిసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్ తమపై అత్యాచారం జరిపాడని ముగ్గురు మహిళలు ఆరోపించగా.. తాను బాలికగా ఉన్నప్పుడు అతను తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది.  ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్.

మహిళలపై తాను లైంగికపరమైన దుర్భాషలు చేసిన వీడియో వెలుగులోకి వచ్చి దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఆమె భర్తపై ఆరోపణలు చేసిన మహిళలతో డొనాల్డ్ ట్రంప్ ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం అధ్యక్ష డిబేట్ లో ట్రంప్-హిల్లరీ మధ్య వాడీవేడి సంవాదం నడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement