సెక్స్‌ టేప్‌ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్‌! | Softcore porn video shows Trump with Playboy models | Sakshi
Sakshi News home page

సెక్స్‌ టేప్‌ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్‌!

Published Sat, Oct 1 2016 4:54 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

సెక్స్‌ టేప్‌ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్‌! - Sakshi

సెక్స్‌ టేప్‌ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్‌!

వాషింగ్టన్‌: మాజీ విశ్వసుందరి ఎలీషియా మచాడో ఓ సెక్స్‌ టేప్‌లో నటించిందంటూ ఆరోపణలు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించనిరీతిలో చిక్కుల్లో పడ్డారు. ఆయన ఈ ఆరోపణలు చేసిన కాసేపటికే..  ఆయన ఉన్న సాఫ్ట్‌కోర్‌ పోర్న్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వెలుగుచూసింది.

‘డైలీమెయిల్‌’ కథనం ప్రకారం 2000 సంవత్సరం నాటి ప్లేబోయ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్‌ అడల్ట్‌ వీడియో స్టోర్‌లో లభించింది. చుట్టు ఉన్న మహిళలను ఉత్సాహ పరుస్తూ షాంపెన్‌ బాటిల్‌ పొంగిస్తూ ఈ వీడియోలో ట్రంప్‌ కనిపించారు.  ఈ వీడియోలో నగ్నంగా ఉన్న మహిళలు లైంగిక చేష్టలకు పాల్పడుతూ కనిపించారు. ‘అందం అందమే. న్యూయార్క్‌లో ఏం జరగబోతున్నదో చూద్దాం’ అంటూ ఈ వీడియోలో ట్రంప్‌ పేర్కొన్నారు.

మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్‌ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ప్రస్తావించారు.

1996లో మిస్‌ యూనివర్స్‑గా గెలుపొందిన వెనిజులా సుందరి ఎలీషియా మచాడోను పంది (మిస్‌ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్‌ మిషన్‌) అంటూ ట్రంప్‌నానా దుర్భాషలు ఆడారు. ఈ  విషయాన్ని ప్రస్తావించిన హిల్లరీ క్లింటన్.. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్‌లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement